
సూర్య దేవాలయం : ఒడిశాలోని కోణార్క్‌లో ఉన్న సూర్య దేవాలయం ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. దీనిని 13వ శతాబద్ధలో నిర్మించడం జరిగింది. ఈ ఆలయాలంలో 24 చకరాలు, 7 గుర్రాలతో రాతితోచెక్కబడిన పెద్ద రథం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఇక్కడ సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలియాడుతూ భక్తులకు దర్శనం ఇచ్చేదంట. ఇక ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని సందర్శిచాలంట.

సిద్ధి వినాయక ఆలయం : ప్రతి ఒక్కరూ తమ జీవితంలో తప్పకుండా ఒక్కసారి అయినా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ముంబైలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ఒకటి. ముంబైలో ఉన్న ప్రసిద్ధ శ్రీ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శి్స్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయంట.

మహాంకాళేశ్వర జ్యోతర్లింగం : ప్రసిద్ధ ఆలయాల్లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఒకటి.ఇది ద్వాదశ జ్యోతిర్లిగాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. ఇక్కడ శివుడు మహాకాళుడిగా వ్యవహారిస్తాడు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే పాపాల నుంచి విముక్తి లభిస్తుందంట.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం : ఏపీలో ఉన్న ఫేమస్ ఆలయాల్లో శ్రీ బాలాజీ టెంపుల్ ఒకటి. ఇక్కడ తిరుమల శేషాచల కొండపై వెంకటేశ్వరస్వామి వెలియడం జరిగింది. భారతదేశంలోని ఫేమస్ టెంపుల్స్‌లో ఇదొక్కటి. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారి అయినా శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంట.

స్వర్ణ దేవాలయం : అమృత్ సర్‌లోని స్వర్ణ దేవాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రసిద్ధ ఆలయాల్లో ఇదొక్కటి. సిక్కుల పవిత్ర పుణ్య క్షేత్రం. ఈ ఆళయం స్వచ్ఛమైన బంగార పూతతో ఉంటుంది. ఇక్కడికి వెళ్లడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందంట. అందువలన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారి అయినా ఈ ఆలయాన్ని సందర్శించాలి.