
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పల్లె, పట్టణాల్లో ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంటి ముందు అందమైన రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలతో చిన్నారుల ఆట, పిండి వంటలు, కోడి పందాలు ఇలా ప్రతి ఒక్కటీ చాలా ఆందాన్ని ఇస్తాయి.

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అమ్మాయిలందరూ ఏ ఏ ముగ్గులు వేయాలా అని తెగ ఆలోచిస్తుంటారు. తమ గల్లీలో అందరికంటే తన ముగ్గే అందంగా, ఆకర్షణీయంగా ఉండాలి అనుకుంటారు. దాని కోసం ఇంటర్నెట్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు.

ఇక కొంత మంది చుక్కల ముగ్గుతో తమ ఇంటిని అందంగా అలంకరించుకోవాలి అనుకుంటే, మరికొంత మంది మాత్రం డిఫరెంట్ డిజైన్స్ ట్రై చేస్తుంటారు.

అయితే మీరు కూడా మీ ఇంటి ముందు అందమైన రంగు రంగుల ముగ్గులు వేయాలి అనుకుంటున్నారా? అయితే ఎప్పుడూ వేసే ముగ్గులే కాకుండా కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటే ఈ అదిరిపోయే డిజైన్స్ ట్రై చేయండి.

భోగి పండుగ రోజు కుండ, ఆవు ఉన్న ఈ ముగ్గులు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి. మరీ ముఖ్యంగా పండుగ వాతావరణం ఉట్టిపడే, చెరుకు , గాలిపటాలు, కోడి పుంజులు ఉన్న ఈ ముగ్గులు మీ ఇంటి ముందు వేయడం చాలా అద్భుతంగా ఉంటుంది.