
మనీ ప్లాంట్ : ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలో మనీ ఫ్లాంట్ మొక్క అనేది తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ మొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తుందని చెబుతుంటారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే చాలా మంది వీటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే అద్దె ఇంటిలో ఉండే వారు కూడా ఈ మొక్కను లివింగ్ రూమ్‌లో పెంచుకోవడం వలన ఇది ప్రతికూల శక్తిని దూరం చేస్తుందంట. ఆర్థిక సమస్యలను తగ్గిస్తుంది.

లక్కీ వెదరు : వాస్తు శాస్త్రం ప్రకారం అత్యంత శక్తివంతమైన మొక్కల్లో లక్కీ వెదురు మొక్క ఒక్కటి. అయితే మీరు అద్దె ఇంటిలో ఉంటున్నట్లు అయితే, మీకు లక్కు కలిసి రావాలి అంటే, తప్పకుండా మీరు మీ ఇంటిలో హాల్‌లో లక్కీవెదురు మొక్క పెట్టుకోవడం వలన ఇది కెరీర్ పరంగా విజయాలను అందిస్తుంది. సాను కూల శక్తి పెంపొందిస్తుంది. అలాగే సంబంధాలను మెరుగు పరుస్తుంది.

తులసి మొక్క : హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ప్రతి కూల శక్తిని తొలిగించి ఇంటిలో సానుకూల శక్తిని పెపొందిస్తుంది. అయితే కొంత మంది అద్దె ఇంటిలో నివసిస్తున్నప్పుడు దీనిని పెంచుకోరు, కానీ అద్దె ఇంటిలో బాల్కనీలో ఈ మొక్కను పెంచుకొని, ప్రతి శుక్ర వారం పూజలు చేయడం వలన ఇది గాలిని శుద్ధి చేస్తుంది, ప్రతికూల శక్తి తొలగిస్తుందంట.

పీస్ లిల్లీ : పీస్ లిల్లీ మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అంతే కాకుండా అంతే సానుకూలంగ కూడా ఉంటుంది. అయితే ఎవరు అయితే మానసిక సమస్యలతో బాధపడుతున్నారో వారు, దీనిని ఇంటిలో పెట్టుకోవడం చాలా మంచిదంట. ఈ మొక్క ఇంటిలో ఉండటం వలన మానిసిక ఒత్తిడి తగ్గి, ఇంట్లో ఆనందకర వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే గాలిని శుద్ధి చేస్తుంది.

స్నేక్ ఫ్లాంట్ : స్నేక్ ఫ్లాంట్ ఇంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఇది లింగ్ రూమ్‌లో పెట్టుకోవడం వలన గాలిని శుద్ధ చేసి, ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. అంతే కాకుండా వాస్తు ప్రకారం కూడా లక్కు తీసుకొస్తుంది. స్నేక్ ఫ్లాంట్ ఇంట్లో ఉండటం వలన నెగటివ్ ఎనర్జీ పోయి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే ఆర్థికంగా కూడా లాభాలు చేకూరుస్తుందంట.