
ఘూమ్ రైల్వే స్టేషన్, డార్జిలింగ్ః దేశంలోని తూర్పు భాగంలో ఉన్న డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే్స్, బొమ్మ రైళ్లను నడుపుతోంది. ఘుమ్ రైల్వే స్టేషన్ అందాన్ని చూసి మీరు మీ కళ్ళను నమ్మలేరు. ఘుమ్ భారతదేశంలోనే ఎత్తైన రైల్వే స్టేషన్.

చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ః దక్షిణ భారతంలో ప్రధాన రైల్వే స్టేషన్ చెన్నై సెంట్రల్. చారిత్రక ప్రాముఖ్యతతో పాటు అద్భుతమైన నిర్మాణ శైలి దీని సొంతం. దీన్ని గోతిక్, రోమనెస్క్ శైలులలో నిర్మించారు. ఇది చూడ్డానికి చాల బాగుంటుంది.

చార్‌బాగ్ రైల్వే స్టేషన్, లక్నోః లక్నో నగరం రుచి, సంస్కృతి, నబావి శైలికి ప్రసిద్ధి. ఇక్కడి చార్‌బాగ్ రైల్వే స్టేషన్ చూడటానికి చాలా పెద్దది. దీన్ని ఇండో-సార్సెనిక్ ఆర్కిటెక్చర్‌లో నిర్మించారు. ఇది చాలా అద్భుతమైన నిర్మాణంలా కనిపిస్తుంది.

మధురై రైల్వే స్టేషన్ః మధురై రైల్వే స్టేషన్ టెంపుల్ టౌన్ తరహాలో నిర్మించారు. దీని రూపకల్పన ప్రసిద్ధ మీనాక్షి ఆలయం నుండి ప్రేరణ. మాల్, ఎయిర్ కాన్కోర్స్ వంటి అనేక సౌకర్యాలు దీనిని విలాసవంతమైన రైల్వే స్టేషన్‌గా చేస్తాయి.

ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబైః అత్యంత రద్దీ గల ముంబై నగరంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ దేశంలోని అత్యంత అందమైన రైల్వే స్టేషన్. గోతిక్ శైలి కలిగిన నిర్మాణంలో క్లిష్టమైన శిల్పాలు కళ్లను కట్టిపడేస్తాయి. ఈ రైల్వే స్టేషన్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చారు.