Lord Shani: శని దోషం ఉన్నప్పటికీ..ఈ రాశులకు అనూహ్య సహాయ హస్తం..!

Edited By: Janardhan Veluru

Updated on: Sep 16, 2025 | 6:59 PM

Lord Shani Dev: సమస్యలతోనూ, ఒత్తిళ్లతోనూ విలవిల్లాడుతున్నవారు సహాయ హస్తం కోసం ఎదురు చూడడం సహజం. తమను ఈ సమస్యల నుంచి గట్టెక్కించేవారి కోసం వేయి దేవుళ్లకు మొక్కడం చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ, అనారోగ్య సమస్యలు వ్యక్తి జీవితం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటాయి. సాధారణంగా శని దోషంలో ఉన్న రాశుల వారు ఈ విధంగా సహాయం కోసం ఎదురు చూస్తుంటారని జ్యోతిషశాస్త్రం కూడా చెబుతోంది. ప్రస్తుతం గ్రహ సంచారం ప్రకారం శని దోషంలో ఉన్న రాశులు మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం మీన రాశులు. ఈ రాశుల వారికి శని దోషం పట్టినప్పటికీ, వీరిని ఆదుకునే లేదా సహాయ హస్తం అందించే గ్రహాలు కూడా ఉన్నాయి.

1 / 6
మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. ఉద్యోగంలో ఎదుగుదల లేకపోవడం, అధికారుల వేధింపులు, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఆదాయం వృద్ధి చెందకపోవడం, ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంటుంది. అయితే, లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు కారణంగా ఈ రాశివారికి మరో ఏడాది పాటు ఏలిన్నాటి శని దోషం కలిగే అవకాశం లేదు. వీరికి పదవీ యోగం, ఆదాయ వృద్ధి కలిగే అవకాశం ఉంది.

2 / 6
సింహం: ఈ రాశికి అష్టమ శని దోషం కొనసాగుతోంది. ఈ దోషం వల్ల ఈ రాశివారికి ఏ పనీ కాకపోవడం, శ్రమ, తిప్పట ఎక్కువగా ఉండడం, వ్యయ ప్రయాసలు పెరగడం, ఆదాయం వృద్ధి చెందకపోవడం, రావలసిన డబ్బు రాకపోవడం, జీవిత భాగస్వామి అనారోగ్యాలకు గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే, 2026 జూన్ వరకూ లాభ స్థానంలో గురువు సంచారం కారణంగా వీరికి ఈ దోషం వర్తించకపోవచ్చు. ప్రతి పనీ తేలికగా పూర్తవడంతో పాటు ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.

3 / 6
కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో నిరాశా నిస్పృహలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి. పని భారం ఎక్కువగా ఉంటుంది. పురోగతి మందగిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పీడిస్తాయి. అయితే, ఈ ఏడాదంతా రాశ్యధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు బాగా బలంగా ఉన్నందువల్ల ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించడంతో పాటు ఆశించిన పురోగతి ఉంటుంది.

4 / 6
ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం కలిగింది. దీనివల్ల కుటుం బంలో సుఖ శాంతులు తగ్గుతాయి. ఆస్తి వివాదాలకు, గృహ వివాదాలకు అవకాశం ఉంటుంది. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉండదు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలో ప్రతి ఫలం లేని పని భారం ఉంటుంది. అయితే, రాశ్యధిపతి గురువు సప్తమ స్థానం నుంచి ఈ రాశిని చూడడం వల్ల 2026 జూన్ వరకు ఇటువంటి సమస్యల ప్రభావం ఏమాత్రం ఉండకపోవచ్చు.

5 / 6
కుంభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శని సంచారం వల్ల ఏలిన్నాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. ఆదాయం బాగా తగ్గుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. మాటకు విలువ ఉండకపోవచ్చు. వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. అనవ సర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే, ఈ రాశిని పంచమ స్థానం నుంచి గురువు వీక్షించడం వల్ల ఈ శని దోషాలు దాదాపు మటుమాయం అవుతాయి. జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

6 / 6
మీనం: ఈ రాశిలో శని సంచారం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి దోషం కలిగింది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం తగ్గిపోతాయి. అనారోగ్యాలు బాగా ఇబ్బంది పెడతాయి. ఏ ప్రయత్నమూ కలసి రాదు. ఆదాయం తగ్గిపోతుంది. గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అయితే, రాశ్యధిపతి గురువుతో పాటు, బుధ, శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఏలిన్నాటి శని దోషం తగ్గిపోతుంది. అన్ని విధాలా అనుకూలతలు పెరుగుతాయి.