Lakshmi Yoga: అనుకూలంగా చంద్రుడు.. ఈ రాశుల వారికి లక్ష్మీయోగం పక్కా..!

Edited By:

Updated on: Aug 15, 2025 | 7:32 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఉచ్ఛ చంద్రుడు లక్ష్మీదేవితో సమానం. జాతకంలో గానీ, గ్రహ సంచారంలో గానీ చంద్రుడు బలంగా, అనుకూలంగా ఉన్న పక్షంలో జీవితమంతా సాఫీగా, హ్యాపీగా సాగిపో తుంది. ఆత్మస్థయిర్యం, ఆత్మ విశ్వాసం, చొరవ, ధైర్యం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ నెల 17, 18, 19 తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్ఛపడుతున్నందువల్ల కొన్ని రాశుల వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. చంద్రుడు మనఃకారకుడైనందువల్ల చంద్రుడు అనుకూలంగా ఉన్నవారు ఎంత సానుకూల దృక్పథంతో ఉంటే అంతగా యోగిస్తాడు. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, మకరం, మీన రాశులకు ఉచ్ఛ చంద్రుడితో అదృష్టం పండే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో తగిన నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యమైన ప్రయత్నాలు చేపట్టడం మంచిది.

1 / 6
మేషం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో చంద్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి అంచనాలకు మించి లాభాలు కలిగిస్తాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి.

2 / 6
వృషభం: ఈ రాశిలో చంద్రుడికి ఉచ్ఛస్థితి కలుగుతున్నందువల్ల ఏ ప్రయత్నం చేపట్టినా నూరు శాతం ఫలితాలనిస్తుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులకు ఈ రాశివారి సలహాలు, సూచనల వల్ల ఉపయోగాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి సమస్యలు, కోర్టు వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.

3 / 6
కర్కాటకం: రాశినాథుడైన చంద్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా చాలావరకు ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, మదుపులు, పెట్టుబడులు అంచనాలకు మించి లాభిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

4 / 6
కన్య: ఈ రాశికి లాభాధిపతి అయిన చంద్రుడు భాగ్య స్థానంలో ఉచ్ఛలో ఉండడం అనేక విధాలుగా అదృష్టాలను కలుగజేస్తుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది.

5 / 6
మకరం: ఈ రాశివారికి పంచమ స్థానంలో చంద్రుడి ఉచ్ఛ స్థితి వల్ల ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో కొన్నిముఖ్యమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంటా బయటా మంచి గుర్తింపు లభిస్తుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. బంధువుల్లో ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగం కలుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.

6 / 6
మీనం: ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన చంద్రుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ మూడు రోజుల కాలంలో ఏ ప్రయత్నం చేపట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా ఆశించిన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి.