- Telugu News Photo Gallery Spiritual photos Lucky Zodiac Signs Ugadi Astrology 2025: Career, Wealth and Marriage Predictions
Ugadi 2025: ఉగాది తర్వాత వారికి అదృష్టమే అదృష్టం..! వారి దశ తిరిగినట్టే..
Lucky Zodiac Signs: ఉగాది నుంచి రెండు నెలల పాటు ఆరు గ్రహాలు రాశులు మారుతున్నందువల్ల ఏడాదిలోగా తమ తమ రంగాల్లో ఒక వెలుగు వెలగబోతున్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, వృశ్చికం, మకరం. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడంతో పాటు, ఆదాయపరంగా ఉన్నత స్థితికి వెళ్లడం, విదేశాల్లో ఉద్యోగాలు సంపాదించడం, మంచి కుటుంబంలో పెళ్లి కావడం, విద్యార్థులు ఘన విజయాలు సాధించడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి వీరికి తప్పకుండా అనుభవానికి వస్తాయి. అనేక విధాలుగా వీరు కొత్త తెలుగు సంవత్సరంలో అదృష్టవంతులయ్యే అవకాశముంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Mar 20, 2025 | 7:17 PM

వృషభం: విశ్వావసు నామ సంవత్సరమంతా ఈ రాశివారికి తరచూ ఏదో ఒక విధంగా భాగ్య యోగం, అధికార యోగం కలుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యం బాగా కుదుటపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. ఒక సంస్థలో అత్యున్నత పదవికి చేరుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా, లాభసాటిగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కూడా కలుగుతుంది.

మిథునం: ఈ రాశివారు వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందుతారు. ఉద్యోగరీత్యా విదేశాలకు బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. మనసులోని కోరికలు, ఆశలు చాలావరకు నెరవేరుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయడం, సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడం, ఆస్తిపాస్తులు కొనడం, బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చేసుకోవడం వంటి కోరికలు నెరవేరుతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.

కన్య: ఈ రాశికి ఉగాది తర్వాత నుంచి సిరిసంపదలు వృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం పెరుగుతుంది. సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి.

తుల: ఈ రాశికి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. రావలసిన సొమ్ము, బాకీలను రాబట్టు కుంటారు. విదేశీ ఉద్యోగాలకు బాగా అవకాశాలు కలుగుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.

8 Vruchikam

మకరం: ఉగాది తర్వాత మే చివరి లోగా అత్యధికంగా అదృష్టాలు కలిగే రాశుల్లో ఈ రాశి మొదటి స్థానంలో ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. మనసులోని కొన్ని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది.





























