
వృషభం: రాశినాథుడు శుక్రుడు ధన, కుటుంబ, వాక్ స్థానమైన ద్వితీయ స్థానంలో సంచారం వల్ల వీరు ఇప్పటికే ప్రేమ జీవితంలో ప్రవేశించి ఉంటారు. ఈ రాశివారిలో ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం వల్ల, వీరి మాట తీరు వల్ల సంపన్న కుటుంబాలకు, ఉన్నత స్థాయి కుటుంబాలకు చెందిన వ్యక్తులు సైతం వీరితో ప్రేమలో పడే అవకాశం ఉంది. పెళ్లికి, కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చే ఈ రాశివారు తప్పకుండా ప్రేమ జీవితంలో విజయం సాధించి పెళ్లి జీవితం ప్రారంభించే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశిలో సంచారం చేస్తున్న గురు, శుక్రుల వల్ల వీరు ప్రేమపరంగా బాగా అదృష్టవంతులవుతారు. పంచమాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి గురువు యుతి చెందడం వల్ల వీరు తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. బంధువర్గం లేదా పరిచయస్థుల్లో వీరికి అనుకోకుండా ప్రేమ భాగస్వామి లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ రాశివారికి రాశ్యధిపతి బుధుడు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరి ప్రేమ జీవితం తప్పకుండా పెళ్లి జీవితంగా మారుతుంది.

కన్య: సాధారణంగా ఈ రాశివారు ఒక పట్టాన ప్రేమలో పడే అవకాశం ఉండదు. అయితే, శుక్ర బలం కారణంగా వీరు ప్రేమ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది. సహచరులతో ప్రేమ పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత వీరు ఆ వ్యక్తికి పూర్తిగా కట్టుబడి ఉంటారు. వీరి ప్రేమ జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. పెద్దల అనుమతి ఉన్నా, లేకపోయినా వీరు తమ ప్రేమ భాగస్వామిని తప్పకుండా పెళ్లి చేసుకోవడం జరుగుతుంది.

తుల: ప్రేమకు కారకుడైన శుక్రుడే ఈ రాశికి అధిపతి కావడం, వీరిని ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉండడం, వీరు సరదాగా, హుషారుగా ఉండే వ్యక్తులు కావడం వంటి కారణాల వల్ల వీరిని జూలై 26 తర్వాత నుంచి పలువురు ప్రేమించే అవకాశం ఉంది. ప్రేమ భాగస్వామిగా తాము ఎంచుకున్న వ్యక్తికి వీరు అన్ని విధాలు కట్టుబడి ఉంటారు. ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం ఉంది. వీరి ప్రేమ వ్యవహారాలు పెద్దల అనుమతితో తప్పకుండా పెళ్లికి దారితీయడం జరుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి అధిపతి అయిన గురువు సప్తమ రాశిలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల వీరు తప్ప కుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. వీరిలోని కలుపుగోలు తత్వం, వీరిలోని యాంబిషన్, దూసుకుపోయే ధోరణి వల్ల తేలికగా ఇతరులను ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో సహచర వ్యక్తితో వీరు ప్రేమలో పడే అవకాశం ఉంది. వీరితో ప్రేమ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ప్రేమ భాగ స్వామి పట్ల వీరు నిజాయితీతో వ్యవహరిస్తారు. ప్రేమలో పడ్డ కొద్ది కాలానికే వీరు పెళ్లాడే అవకాశం ఉంది.

కుంభం:ఈ రాశికి అధిపతి శనీశ్వరుడైనందువల్ల వీరు ఒక పట్టాన ప్రేమలో పడే అవకాశం ఉండదు. అయితే, కుటుంబ స్థానాధిపతి అయిన గురువు శుక్రుడితో కలిసి పంచమ స్థానంలో ఉన్నందు వల్ల వీరు అనుకోకుండా ప్రేమలో పడే అవకాశం ఉంది. బాగా పరిచయస్థులలో లేదా ఇరుగు పొరుగున ఉంటున్నవారితో వీరు ప్రేమలో ప్రేమలో పడడం జరుగుతుంది. వీరి ప్రేమ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. త్వరలో తమ ప్రేమ భాగస్వామిని పెళ్లాడడం కూడా జరుగుతుంది.