
వృషభం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు సప్తమాధిపతి కుజుడిని కలవడం వల్ల ఉద్యోగంలో ప్రాదాన్యం బాగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. అయితే, దాంపత్య జీవితం మాత్రం ఒత్తిడికి గురవుతుంది. జీవిత భాగస్వామి ఆధిపత్యం పెరుగుతుంది. తరచూ వాదోపవాలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది.

కర్కాటకం: ఈ రాశికి పంచమ స్థానంలో కుజ, శుక్రుల యుతి వల్ల ఉద్యోగంలో సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. హోదా, జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. అయితే, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు తగ్గే అవకాశం ఉంది. ఈగో సమస్యల వల్ల ఎడమొహం, పెడమొహంగా మారే అవకాశం ఉంది. మాట తొందరపాటు ఉంటుంది.

సింహం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజ, శుక్రుల సంచారం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం లభిస్తుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. అయితే, దాంపత్య జీవితంలో చిటపటలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహకారం అందకపోవచ్చు.

తుల: ఈ రాశికి ద్వితీయ స్థానంలో రాశ్యధిపతి శుక్రుడు కుజుడితో కలవడం వల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా సఫలం అవుతుంది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో జీతభత్యాలు వృద్ది చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. అయితే, కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. దంపతుల మధ్య వాగ్వాదాలు, వివాదాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.

వృశ్చికం: ఈ రాశిలో కుజ, శుక్రుల సంచారం వల్ల ఈ రాశివారికి ఇంటా బయటా ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. నైపుణ్యాలు, సృజనాత్మకత వృద్ధి చెందుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అయితే, కుటుంబంలో మాత్రం ఈగో సమస్యలు విజృంభిస్తాయి. జీవిత భాగస్వామి ఆధిపత్యం చెలాయిస్తారు. మాటలు, చేతలు ఇబ్బంది కలిగిస్తాయి.