Janmashtami 2025: జన్మాష్టమి రోజున ఈ చర్యలు చేయండి.. కన్నయ్య అనుగ్రహం మీ పిల్లల సొంతం..

Edited By: TV9 Telugu

Updated on: Aug 18, 2025 | 11:57 AM

జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుని జన్మదినోత్సవం మాత్రమే కాదు, పిల్లల భవిష్యత్తు, విజయానికి కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రం, పురాణాల ప్రకారం ఈ రోజున తీసుకునే ప్రత్యేక చర్యలు పిల్లల తెలివితేటలు, ఆరోగ్యం, కెరీర్‌లో వేగవంతమైన పురోగతిని నిర్ధారించగలవు. మీరు మీ పిల్లలు విజయం వైపుగా పయనించాలని కోరుకుంటుంటే జన్మాష్టమి నాడు తీసుకునే ఈ సులభమైన, ప్రభావవంతమైన చర్యలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

1 / 8
శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి రోజున దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం చాలా శుభప్రదమైన యోగంలో జన్మాష్టమి పండుగ వచ్చింది. ఇది పిల్లల భవిష్యత్తును రూపొందించడానికి ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తీసుకునే చర్యలు త్వరిత ఫలితాలను ఇస్తాయని,  పిల్లల విద్య, వృత్తి, జీవితంలో విజయానికి మార్గం సుగమం చేస్తాయని విశ్వాసం.

2 / 8
జన్మాష్టమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఆధ్యాత్మిక, కుటుంబ వృద్ధికి ఒక సందర్భం. ఈ రోజున భక్తి , ప్రేమతో దేవుడిని స్మరిస్తే, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థిస్తే.. సానుకూల మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. అందువల్ల జన్మాష్టమి పండుగ మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాదు పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఒక వరంలా కూడా నిరూపించబడుతుంది.

3 / 8
బాల గోపాలునికి ప్రత్యేక పూజలు: జన్మాష్టమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంట్లోని ప్రార్థనా స్థలంలో బాల్యంలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటాన్ని ఉంచండి. పిల్లలతో పాటు భగవంతుడికి వెన్న, చక్కెర మిఠాయి, పాలు, తులసి దళాలు సమర్పించండి. ఇది ఇంట్లోని చిన్న సభ్యులపై భగవంతుని ఆశీర్వాదం ఉంచుతుందని, వారు ప్రతి రంగంలోనూ పురోగతి సాధిస్తారని నమ్ముతారు.

4 / 8
విద్యలో పురోగతి కోసం: జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజున పిల్లలు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ మంత్రం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత,  చదువుపై ఆసక్తిని మెరుగుపరుస్తుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు ఈ మంత్రాన్ని జపించాలి. తద్వారా కుటుంబం అంతటా సానుకూల శక్తి ప్రవహిస్తుంది.

5 / 8
కెరీర్‌లో విజయం కోసం దానం: జన్మాష్టమి నాడు పేద పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు, కాపీలు లేదా విద్యకు సంబంధించిన వస్తువులను దానం చేయడంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ విరాళం మీ పిల్లల కెరీర్‌లో అడ్డంకులను తొలగిస్తుంది. అలాగే ఇది వారిలో సేవా భావాన్ని, కరుణను మేల్కొల్పుతుంది.

6 / 8
చెడు దృష్టి నుంచి రక్షణ: జన్మాష్టమి రాత్రి పిల్లల నుదుటిపై గంధపు తిలకం దిద్ది.. మేడలో తులసి మాల వేయండి. ఇది వారి ప్రకాశాన్ని పెంచడమే కాకుండా.. వారిని ప్రతికూల శక్తి నుంచి రక్షిస్తుంది. మత గ్రంథాలలో తులసి అత్యంత పవిత్రమైనది. రక్షణాత్మకమైనదిగా పరిగణించబడుతుంది.

7 / 8
ఇంట్లో శ్రీ కృష్ణ కథ వినడం: ఈ రోజున పిల్లలకు శ్రీ కృష్ణుడి జనన కథను చెప్పడం మర్చిపోవద్దు. ఇది వారిలో మతపరమైన, నైతిక విలువలను అభివృద్ధి చేస్తుంది. శ్రీ కృష్ణుడి జీవితం నుంచి ప్రేరణ పొంది, వారు ధైర్యం, న్యాయం, కరుణ వంటి లక్షణాలను నేర్చుకోవచ్చు.

8 / 8
సందర్భం, ప్రయోజనాలు: అష్టమి తిథి అనంతమైన (∞) శక్తి , శాశ్వత పురోగతిని సూచించే 8 సంఖ్యతో సంబంధం కలిగి ఉందని గ్రంథాలలో ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుడు స్వయంగా ఎనిమిదవ బిడ్డగా  దేవకీ నందుడికి జన్మించాడు. కృష్ణుడి జీవితం న్యాయం, సత్యం, విధికి ప్రతిరూపం. జన్మాష్టమి నాడు చేసే నివారణలు పిల్లల జీవితాలలో ఈ ఆధ్యాత్మిక శక్తిని సక్రియం చేయగలవు.