AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న విజయ్, నేడు అంబానీ.. కోరిన కోరికలు తీర్చే మూకాంబిక ఆలయం ప్రత్యేకత ఇదే!

తమిళనాడు ఫేమస్ ఆలయాల్లో శ్రీ మూకాంబికా ఆలయం కూడా ఒకటి. అయితే ఈ మధ్య తమిళనాడు సీఎం, నటుడు విజయ్ ఈ పుణ్య క్షేత్రాన్ని సందర్శించి, పూజలు చేసిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఆలయాన్ని ఆదివారం, అపర కుబేరుడు అనంత్ అంబానీ కూడా సందర్శించడం జరిగింది.

Samatha J
|

Updated on: Jun 15, 2026 | 2:44 PM

Share
కర్ణాటకలోని ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో మూకాంబిక ఆలయం ఒకటి. ఇది ఉడుపి జిల్లాలోని ప్రసిద్ధ కొల్లూరులో ఉంది. పార్వతీ దేవికి అంకితం చేయబడిన ఏకైక ఆలయంలో ఇదొక్కటి, దీనిని పరశురాముడు నిర్మించాడని చెబుతుంటారు.  ఈ ఆలయంలోకి ఎక్కువగా తమిళనాడు , కర్ణాక , ఆంధ్ర ప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

1 / 5
అయితే ఈ ఆలయాన్ని ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సందర్శించి, ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. ఇక మరో ప్రముఖ వ్యక్తి పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

2 / 5
అనంత్ అంబానీ తన కుటుంబ గురువుతో కలిసి ఆలయానికి చేరుకొని గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనంత్ అంబానీని ఆలయ అధికారులు, అర్చకులు శాలువాతో సత్కరిచి, అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది.

3 / 5
ఇక మూకాంబిక ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం అనంత్ అంబానీ ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీ కృష్ణ మఠాన్ని సందర్శించి, అక్కడ కృష్ణుడి సేవలో పాల్గొనడం జరిగింది. అనంత్ అంబానీ కొల్లూరు ఆలయం పర్యాటన అక్కడి భక్తులు, సందర్శకులను ఆకర్షించింది.

4 / 5
ఇక దక్షిణ భారత దేశంలోనే చాలా ఫేమస్ ఆలయం అయిన కొల్లూరు శ్రీమూకాంబిక ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులను, సినీ ప్రముఖులను, పారిశ్రామిక వేత్తలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇక్కడికి నిత్యం వేల సంఖ్యలో సామాన్య భక్తులు మాత్రమే కాకుండా, రాజకీయ నాయకులు, సినీ నటులు వస్తుండటం విశేషం. మరీ ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేసి, ప్రజల దృష్టిని బాగా ఆకర్షించిన కొద్ది రోజులకే, అనంత్ అంబానీ పర్యటన జరగడంతో ఈ టెంపుల్ మరోసారి వైరల్‌గా మారింది.

5 / 5
Follow Us