
మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న కేతువు వల్ల జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. స్తబ్ధతగా ఉన్న జీవితం ఒక్కసారిగా బిజీ అయిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా ఊహించని గుర్తింపు లభిస్తుంది. పిల్లలు చదువుల్లో రికార్డులు సృష్టిస్తారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. సృజనాత్మకత, నైపుణ్యాలు బాగా వృద్ధి చెందుతాయి. అధికారులకు మీ సలహాలు, సూచనలు బాగా ఉపయోగపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి.

కర్కాటకం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ఆదాయం ఊహించని స్థాయిలో వృద్ధి చెందుతుంది. ఇతరుల సహాయం పొందుతున్నవారు ఇతరులకు సహాయం చేయగల స్థితికి చేరుకుంటారు. మొత్తం మీద ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. కుటుంబంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి అనుకోకుండా విముక్తి లభిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కేతువు ఈ రాశివారిని అనేక విధాలుగా అదృష్టవంతుల్ని చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సమర్థతకు, ప్రతిభకు సరికొత్త గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై ఊరట చెందుతారు.

వృశ్చికం: ఈ రాశికి కేతువు దశమ స్థానంలో ఉన్నందువల్ల ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సీనియర్లను కాదని పదోన్నతులు లభించడంతో పాటు జీతభత్యాలు బాగా పెరుగుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలి స్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా లభిస్తాయి. శుభ కార్యాలు జరుగుతాయి. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న కేతువు కలలో కూడా ఊహించని అదృష్టాలు కలగజేయడం జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందు తాయి. ఊహించని మార్గాల్లో ఆదాయం వృద్ది చెందుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తిపాస్తులు చేతికి అందుతాయి. సంతాన యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది.

కుంభం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న కేతువు వల్ల ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో అనుకోకుండా ప్రేమలో పడడం, పెళ్లి ఖాయం కావడం వంటివి జరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే సూచనలున్నాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. సంతాన యోగం కలుగుతుంది. సన్మానాలు, సత్కారాలు జరిగే అవకాశం ఉంది.