Guru Gochar 2026: గురు గ్రహం అనుకూలత..2026లో వారికి ప్రముఖులుగా గుర్తింపు..!

Edited By:

Updated on: Dec 30, 2025 | 4:22 PM

Jupiter Transit in Cancer 2026: గురు గ్రహం బాగా అనుకూలంగా ఉన్నవారు తప్పకుండా ప్రముఖులవుతారని, వారికి కీర్తి ప్రతి ష్ఠలు పెరుగుతాయని, వారు ఎంత చెబితే అంత అన్నట్టుగా ఉంటుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. గురు బలం కలిగినవారి జీవితాల్లో విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. జూన్ వరకు మిథున రాశిలో సంచారం చేస్తున్న గురు గ్రహం జూన్ 3న తనకు ఉచ్ఛ క్షేత్రమైన కర్కాటక రాశిలో ప్రవేశించి, ఏడాదిపాటు ఆ రాశిలోనే కొనసాగుతుంది. ఉచ్ఛ గురువు అనుకూలంగా ఉన్న రాశులవారు ప్రముఖులుగా గుర్తింపు పొందుతారు. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మకర రాశులవారు ప్రముఖుల జాబితాలో చేరే అవకాశం ఉంది.

1 / 7
మేషం: ఈ రాశివారికి 2025 కన్నా 2026 బ్రహ్మాండంగా సాగిపోయే అవకాశం ఉంది. బంధుమిత్రుల్లో ఒక ప్రత్యేక స్థానం లభించే అవకాశం ఉంది. వీరు ఫిబ్రవరి తర్వాత నుంచి ఒక ప్రముఖుడుగా, ఒక సంపన్నుడుగా గుర్తింపు పొందడం జరుగుతుంది. వీరి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. గురువు చతుర్థ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల జూన్ నుంచి వీరికి హంస మహా పురుష యోగం పట్టి రాజకీయంగా, ప్రభుత్వపరంగా ప్రాబల్యం, ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరిగే సూచనలున్నాయి.

2 / 7
మిథునం: ఈ రాశిలో ప్రస్తుతం గురువు సంచారం చేస్తున్నందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనే కాక, సామాజికంగా కూడా ఈ రాశివారికి గౌరవమర్యాదలు, ఆదరాభిమానాలు పెరుగుతాయి. వీరి సలహాలు, సూచనలతో బంధుమిత్రులే కాక, అధికారులు కూడా బాగా లబ్ధి పొందుతారు. జూన్ నెల నుంచి ధన స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశికి చెందిన సగటు వ్యక్తి సంపన్నుడు కావడం, చిన్న ఉద్యోగి ఉన్నతోద్యోగి  కావడం జరుగుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది.

3 / 7
కర్కాటకం: ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడు, ముఖ్యుడు అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నందు వల్ల మే వరకు ఈ రాశివారి జీవితం స్తబ్ధుగా సాగిపోయే అవకాశం ఉంది. అయితే, జూన్ మొదటి వారంలో గురువు ఈ రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టిన దగ్గర నుంచి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ రాశిలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల వీరికి హంస మహా పురుష యోగం కలిగి, ఒక ప్రముఖుడుగా, సంపన్నుడుగా, రాజకీయవేత్తగా, సలహాదారుగా మంచి గుర్తింపు లభిస్తుంది.

4 / 7
కన్య: ఈ రాశికి కొత్త సంవత్సరంలో కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. శని, రాహువుల అనుకూలత కారణంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అన్ని విధాలా బాగా అనుకూలంగా సాగిపోతున్నప్పటికీ, అసలైన స్వర్ణయుగం జూన్ మొదటి వారంలో గురువు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడంతో ప్రారంభ మవుతుంది. సగటు వ్యక్తి కూడా సంపన్నుడవుతాడు. మామూలు ఉద్యోగి కూడా ఉన్నతోద్యోగి అవుతాడు. ఇంటా బయటా వీరి పేరు ప్రఖ్యాతులు, పలుకుబడి మార్మోగిపోయే అవకాశం ఉంది.

5 / 7
తుల: ఈ రాశికి ప్రస్తుతం భాగ్య స్థానంలో ఉన్న గురువు, తృతీయ స్థానంలో ఉన్న శుక్రుడు ఈ రాశి వారికి ఏ లోటూ లేకుండా చేస్తున్నప్పటికీ, మార్చి నుంచి మాత్రం వీరి జీవితం పట్టపగ్గాలు లేకుండా అభివృద్ధి చెందుతుంది. మార్చిలో రాశ్యదిపతి శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛపట్టడంతో వీరి దశ తిరుగుతుంది. జూన్ లో దశమ కేంద్రంలో గురువు ఉచ్ఛ పట్టడంతో వీరికి హంస మహా పురుష యోగం కలుగుతుంది. అక్కడి నుంచి వీరి జీవితం అన్ని విధాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది.

6 / 7
వృశ్చికం: కొత్త సంవత్సరంలో ఈ రాశివారికి తప్పకుండా కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. మార్చి నుంచి దశ తిరగడం ప్రారంభమై ఏడాదంతా ఉజ్వలంగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మార్చిలో పంచమంలో శుక్రుడు, జూన్ లో భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛపట్టడం వల్ల వీరి జీవితం మారిపోతుంది. ఆదాయం వృద్ధి చెందడం, ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందడం, వృత్తి, వ్యాపా రాలు కొత్త పుంతలు తొక్కడం వంటివి జరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి.

7 / 7
మకరం: ఈ రాశివారు 2025లో కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గిపోవడం, ఆదాయం వృద్ది చెందడం, ఉద్యోగం సాఫీగా సాగిపోవడం, కుటుంబ జీవితం హ్యాపీగా ముందుకు సాగడం వంటివి జరిగినప్పటికీ, ఇంతకు మించిన ధన, రాజయోగాలు 2026లో పట్టే అవకాశం ఉంది. మార్చిలో ఉచ్ఛ శుక్రుడు మీన రాశిలో రాశ్యధిపతి శనితో కలవడం, జూన్ లో గురువు సప్తమ స్థానంలో హంస మహా పురుష యోగాన్ని కలిగించడం వల్ల అత్యంత ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.