
మేషం: వ్యయ స్థానంలో ఉన్న శనీశ్వరుడిని ఉచ్ఛ గురువు వీక్షించడం వల్ల ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ఉద్యోగులకే కాక, నిరుద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు అందడం జరుగుతుంది. ఆదాయంలో ఊహించని వృద్ధికి అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు.

సింహం: గురు దృష్టి వల్ల ఈ రాశికి అష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది.

కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న శని వల్ల కలుగుతున్న అనర్థాలకు గురు దృష్టితో తెరపడుతుంది. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలిగే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశికి అర్ధాష్టమ శని దోషం 45 రోజుల పాటు దాదాపు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో పెళ్లి, గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.

కుంభం: గురు దృష్టి కారణంగా ఏలిన్నాటి శని దోషం దాదాపు మటుమాయం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు, ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. పదోన్నతికి అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగం లోకి మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు.

మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న శని వల్ల ఈ రాశికి ఏలిన్నాటి శని దోషం కలిగింది. అయితే, రాశ్యధిపతి గురువుకు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితి కలిగి ఈ శనిని వీక్షించడం వల్ల ఈ రాశివారికి ఏ రంగంలో ఉన్నా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది.