
వృషభం: పుత్ర కారకుడైన గురువు ద్వితీయ స్థానంలో ఉండడం, పంచమ స్థానాధిపతి బుధుడు అనుకూల చేస్తుండడం వల్ల ఈ రాశివారికి అక్టోబర్ లోపు తప్పకుండా సంతాన యోగం కలిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారు. అద్భుతమైన ప్రతిభా పాటవాలు కలిగి ఉంటారు. పోటీ పరీక్షల్లో రికార్డు స్థాయి విజయాలు సాధిస్తారు. మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం, దూర ప్రాంతంలోనే పెళ్లి సంబంధం కుదరడం జరుగుతుంది.

మిథునం: ఈ రాశిలో గురు సంచారంతో పాటు పంచమాధిపతి శుక్రుడు అనుకూల సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి ఈ ఏడాది తప్పకుండా పిల్లలు కలిగే అవకాశం ఉంది. పిల్లల విషయాలకు సంబంధించినంత వరకు ఈ రాశివారు నిశ్చింతగా ఉండవచ్చు. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. చదువుల మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. అదనపు నైపుణ్యాలు, శిక్షణల్లో కూడా బాగా రాణించే అవకాశం ఉంది. పిల్లల విషయంలో ఈ రాశివారు నిత్యం శుభవార్తలు వింటూనేఉంటారు.

సింహం: పుత్ర కారకుడైన గురువు ప్రస్తుతం ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. పిల్లల విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలకు సంబంధించి సమస్యలు ఉండే అవకాశం లేదు. ఉన్నత విద్యకు, మంచి ఉద్యోగాలకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. సాధారణంగా వైద్యం, బ్యాంకింగ్, టెక్నికల్ లేదా టెక్నలాజికల్ రంగాల్లో పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకోవడం, విదేశాల్లో స్థిరపడడం జరుగుతుంది.

తుల: సంతాన కారకుడైన గురువు భాగ్య స్థానంలో సంచారంతో పాటు పంచమాధిపతి శని కూడా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశివారికి పిల్లలకు సంబంధించి ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. పిల్లలకు సంబంధించి అనేక అదృ ష్టాలు కలుగుతాయి. పిల్లల మీద ఈ రాశివారు పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయి. పిల్లలు ఉన్నత విద్యకు విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. విదేశాల్లోనే మంచి ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది.

ధనుస్సు: రాశ్యధిపతి, సంతాన కారకుడు అయిన గురువు సప్తమ స్థానంలో ఉన్నందువల్ల, పంచమాధిపతి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశివారికి అతి త్వరలో సంతాన యోగం కలుగుతుంది. ఈ రాశివారి పిల్లలు బాగా అదృష్టవంతులు, ఆరోగ్యవంతులు అవుతారు. పిల్లల జీవితాల్లో ఊహిం చని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు చదువుల్లోనే కాక, ఉద్యోగాల్లో సైతం రాణించడం, గుర్తింపు తెచ్చుకోవడం జరుగుతుంది. వైవాహిక జీవితం కూడా హ్యాపీగా సాగిపోతుంది.

కుంభం: పుత్రకారకుడు గురువు, పంచమాధిపతి బుధుడు అనుకూలంగా సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు సంతాన ప్రాప్తికి సంబంధించి త్వరలో శుభవార్త వినే ఉంది. చదువుల విషయంలో పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వీరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు అనారోగ్య సమస్యలు, వైఫల్యాలు, ఆశాభంగాలు ఉండకపోవచ్చు. పిల్లల్లో ఒకరికి బంధువుల్లో పెళ్లయ్యే అవకాశం ఉంది.