Mysterious Ganesha Temples: మనదేశంలోని ఈ రహస్య గణపతి ఆలయాలు.. ప్రపంచ ప్రసిద్ధి.. విదేశీ భక్తులు కూడా క్యూ..

| Edited By: TV9 Telugu

Aug 22, 2024 | 1:14 PM

భారతదేశంలో గణపతికి చెందిన అనేక దేవాలయాలున్నాయి. కొన్ని దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇవి స్థల పురాణంతోనో ఆలయ నిర్మాణంతోనో ఈ ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. ఈ రోజు  దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఖ్యాతి గడించిన 5 ప్రత్యేక గణపతి ఆలయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

1 / 5
ఇండోర్‌లోని ఖజ్రానా అనే చిన్న పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గణేష్ దేవాలయం ఉంది. ఇక్కడ  గణేశుడి విగ్రహం వెనుక స్వస్తిక్ గుర్తును వేసి మోదకం నైవేదంగా పెడితే తమ కోరికలు నెరవేరతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని 1735లో హోల్కర్ రాజవంశానికి చెందిన సామ్రాజ్ఞి అహల్యాబాయి నిర్మించారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆలయానికి మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయ గోడలకు దారాలు కడతారు. ఇలా చేసినప్పుడే ఆలయ దర్శనం పూర్తి అయినట్లు పరిగణిస్తారు. ప్రతి బుధవారం ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, హారతులను ఇస్తారు. ఈ ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

2 / 5
మధ్యప్రదేశ్‌లోని జునా ప్రాంతంలో దేవాలయం జునా చింతామన్ గణేష ఆలయం. సుమారు 1200 సంవత్సరాల నాటి ఈ దేవాలయం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన వినాయకుడు భక్తుల సమస్యలను ఫోన్, మొబైల్, లెటర్‌తో విని సమస్యను పరిష్కరిస్తాడని ఖ్యాతి. ఈ విషయానికి రుజువు జర్మనీకి చెందిన ఒక భక్తుడు గణేశుడితో మాట్లాడాలని పట్టుబట్టాడని.. అలా గణపతికి చెవిలో తన సమస్య చెప్పిన ఆ విదేశీ భక్తుడి సమస్య తీరినట్లు.. వినాయకుడితో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత తన సమస్య తీరినట్లు  తెలిపాడని చెబుతారు. అప్పటి నుండి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. భక్తుడు పూజారి ద్వారా గణేష్ దేవునితో మాట్లాడి తన కోరికను తీర్చుకుంటారు

3 / 5
రాజస్థాన్ లోని రణథంబోర్ కోటలో ఉన్న త్రినేత్ర గణేశ దేవాలయం ప్రసిద్ధ చెందిన పురాతన దేవాలయం. ఈ కోటలో గణేశుడు త్రినేత్రుడు. ఇది సుమారు 1000 సంవత్సరాల నాటిది. ఈ ఆలయాన్ని మహారాజా హర్మీర్‌దేవ్ చౌహాన్ నిర్మించారు. ఈ ఆలయంలో వినాయకుడు స్వయంగా వెలిసినట్లు చెబుతారు. 

4 / 5
మండై గణపతి ఆలయం మహారాష్ట్రలోని పూణేలోని అతి పెద్ద గణపతి ఆలయం. ఇక్కడ గణపతి ఆలయాన్ని అఖిల గణపతి మండలం అంటారు. దేశ విదేశాల నుండి ఇక్కడ స్వామివారిని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు.   

5 / 5
ఉచ్చి పిల్లయార్ ఆలయం తమిళనాడులోని తిరుచ్చి నగరంలోని కొండపై ఉంది. ఈ ఆలయం దేశ, విదేశాల్లో ప్రసిద్ధి చెందింది. భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయంలోని గణపతిని దర్శించుకుంటారు. చైల్ రాజులు పర్వతాలను చదును చేసి ఈ ఆలయాన్ని నిర్మించారు. పర్వత శిఖరం కారణంగా ఈ గణేష్ దేవాలయాన్ని  హై పిళ్లైయార్ అని పిలుస్తారు.