
డిసెంబర్ 8వ తేదీన చంద్రుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇప్పటికే గురు గ్రహం అదే రాశిలో ఉన్నందున, గురు చంద్ర గ్రహాల సంయోగం ఏర్పడనుంది. దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకొస్తుంది. దీని వలన మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి : మిథున రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. గజకేసరి రాజయోగం వలన డిసెంబర్ నెల మొత్తం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. అనుకున్నపనులన్నింటినీ సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఊహించని విధంగా ధన లాభం కలుగుతుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదిస్తారు. ఆదాయం కూడా పెరగడంతోచాలా ఆనందంగా గడుపుతారు.

కన్యా రాశి :గజకేసరి రాజయోగ ప్రభావంతో కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వీరి ఇంట శుభకార్యాలు జరిగే ఛాన్స్ ఉంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా గడుపుతారు.

ఈ రాశి వారికి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వివాహితులకు వివాహ యోగం వలన ఈ యేడాది పెళ్లి కుదిరే అవకాశాలున్నాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు అందుకుంటారు. అదే విధంగా డబ్బు చేతికి అందుతుంది.