
మేషం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన గురువు భాగ్య స్థానాన్ని వీక్షిస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్ప కుండా విదేశీయాన యోగం, విదేశీ సంపాదనను అనుభవించే యోగం కలుగుతాయి. ఉద్యోగ పరంగా చిన్న ప్రయత్నం చేసినా విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం లభిస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. వృత్తిపరంగా కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలరీత్యా తరచూ విదేశాలకు వెళ్లడం కూడా జరుగుతుంది.

వృషభం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శనీశ్వరుడు లాభ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి తప్పకుండా విదేశీ యోగం కలుగుతుంది. ఉద్యోగులు, డాక్టర్లు, టెక్నాలజీ రంగానికి చెందిన వారు, పరిశోధకులు ఇతర దేశాల్లో సంపాదన చేపట్టడానికి బాగా అవకాశం ఉంది. సాధారణంగా ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో వీరికి విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. విదేశాల్లో స్థిరపడ్డ వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో స్థిరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

మిథునం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన శని దశమంలో ఉండడం, విదేశాలకు కారకుడైన రాహువు భాగ్య స్థానంలోనే ఉండడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. విదేశాల్లో వృత్తి, వ్యాపారాలు చేపట్టడానికి అవకాశాలు కలుగుతాయి. టెక్నాలజీ, పరిశోధనలు, ఉన్నత విద్య, నైపుణ్యాల వృద్ది వంటి కారణాల వల్ల ఇతర దేశాలకు వెళ్లడం, అక్కడి సంపాదనను చాలా కాలం పాటు అనుభవించడం జరుగుతుంది.

కన్య: ఈ రాశికి భాగ్యస్థానాధిపతి శుక్రుడు ప్రస్తుతం ఉద్యోగ స్థానంలో గురువుతో కలిసి ఉండడం వల్ల వీరికి అతి త్వరలో విదేశీయాన యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం, అక్కడే స్థిరపడడం జరగవచ్చు. విదేశాల్లో ఉద్యోగపరంగా స్థిర పడిన వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. ఉన్నత విద్యలకు వెళ్లే సూచనలు కూడా ఉన్నాయి.

తుల: రాశ్యధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడంతో పాటు గురువుతో కలిసి ఉండడం వల్ల ఈ రాశి వారికి విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం తప్పకుండా కలుగుతుంది. కొద్ది ప్రయత్నంతో అనేక విదేశీ ఆఫర్లు అందుతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు సైతం ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఏ రంగానికి చెందినవారైనా విదేశీ ఉద్యోగాలకు అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో నైపుణ్యాలను పెంచుకోవడానికి, ఉన్నత విద్యలకు, ఆధునిక శిక్షణకు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.

మకరం: ఈ రాశికి భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఉన్నత విద్యల కోసం, ఆధునిక శిక్షణ కోసం, పరిశోధనల కోసం విదేశాలకు వెళ్లి స్థిరపడే అవకాశాలు ఎక్కువగా కనిపి స్తున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో మరింత పురోగతి సాధించడం కోసం విదేశాలకు వెళ్లడం జరుగు తుంది. ఉద్యోగరీత్యా చాలాసార్లు ఇతర దేశాలకు వెళ్లవలసి వస్తుంది. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు లభిస్తాయి.