తరతరాల ఆచారం ఆగిపోయింది! ఈ సారి చిత్రపటాలతో శ్రీరామనవిమి వేడుకలు..

Edited By: TV9 Telugu

Updated on: Apr 07, 2025 | 1:27 PM

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం లక్ష్మీపురంలోని గిరిజనులు శ్రీరామనవమిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఉత్సవ విగ్రహాలకు బదులుగా, సండ్ర, పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సీతా రామ లక్ష్మణ ఆంజనేయులుగా పూజిస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. కానీ ఈ ఏడాది, చెట్ల కొరత కారణంగా, చిత్రపటాలను ఉపయోగించి కళ్యాణం జరిగింది.

1 / 5
ఏలూరు: భారత దేశంలో ప్రతి గ్రామంలో పెద్దఎత్తున జరిగే పండుగ శ్రీ రామ నవమి . గ్రామంలోని రామాలయాలు , హనుమతుని గుడులు , మందిరాలలో మాత్రమె కాదు చలువ పదిల్లు వేసి సీతా రాముల విగ్రహాలను అందులో ఉంచి పూజలు చేస్తుంటారు. సీతా రాముల కళ్యాణం జరిపించి పానకం , వడపప్పు ప్రసాదం గా  తీసుకుంటారు. ఐతే ఏలూరు ఏజెన్సిలో  ఉత్సవ విగ్రహాలకు బదులు చెట్ల మానులనే దేవతలుగా కొలవడం అనేక సంవత్సరాలుగా అనవాటిగా వస్తుంది. బుట్టాయగూడెం మండలంలో ఉన్న లక్ష్మీపురంలో శ్రీరామ నవమి వేడుకలు అంగరంగ వైభవంగా గిరిజనుల సాంప్రదాయ పద్ధతుల్లో చేస్తారు.

2 / 5
అయితే ఇక్కడ స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలు ఏమి ఉండవు. నవమీ ఉత్సవాల పేరుతో కళ్యాణ క్రతువు జరిపించేందుకు నాలుగు రకాల చెట్ల మానులు అడవి నుంచి తీసు కొచ్చి రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడిగా ఏర్పాటు చేసుకొని వాటినే పూజిస్తూ వస్తున్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామంలో రామాలయం ఏర్పాటు చేసినా తాము చెట్లనే దేవుళ్లుగా కొలుస్తా మంటూ గిరిజనులు చెబుతున్నారు. గ్రామంలో   50 కుటుంబాలకు చెందిన నాయక్ పోడు తెగకు చెందిన గిరిజనులు తరతరాలుగా నివసిస్తున్నారు.

3 / 5
ఈ గ్రామ ఇలవేల్పు గంగానమ్మ. ఆ  అమ్మ కు ఎక్కువగా  పూజలు చేస్తారు. అయితే గంగానమ్మ అమ్మవారు తరువాత గిరిజనులు ఇష్టంగా  శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడినే అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే వీరికి  విగ్రహాలు  మాత్రం పెట్టరు.  శ్రీరామనవమికి ముందు రోజు గ్రామస్తుల్లో పెద్దలు, యువకులు అడవిలోకి వెళ్లి 4 రకాల చెట్ల మానులు సేకరించి వాటిని ప్రత్యేక రూపంలో మలిచి ఘనంగా పూజలు చేస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయం  ఈ సారి మారింది.

4 / 5
శ్రీరామనవమికి ముందు ఉత్సవ కమిటీ సభ్యు లుగా ఉన్న పెద్దలు, యువకులు అడవికి వెళ్ళి  సండ్ర,  పాల, ఊడిగ, రావి చెట్ల మానులను సేకరిస్తారు. శ్రీరాముడికి సండ్ర, సీతాదేవికి పాల, లక్ష్మ ణుడికి ఊడిగ, ఆంజనేయుడికి రావి చెట్టు మానులను తీసుకువచ్చి వాటిని చెక్కించి గ్రామం మధ్యలో ప్రతిష్ఠిం చి పూజలు చేస్తారు. ఇలా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు సీతారామ కల్యాణాన్ని ఘనంగా జరుపుకుంటునామని గిరిజనులు ఆనందంగా చెబుతున్నారు.

5 / 5
తొలినాళ్ళలో గ్రామంలో రామాలయం లేకపోవడంతో తమ పూర్వీకులు అడవిలో నుంచి మానులను తీసుకువచ్చి కొయ్య బొమ్మలతో దేవతా మూర్తులుగా మలిచి రాముల వారి కళ్యాణం జరిపించే వారిని, అదే ఆనవాయితీ నేటి వరకు కొనసాగుతూ వచ్చిందని పలువురు గిరిజన పెద్దలు పేర్కొంటున్నారు. కాని ఈ ఏడాది తరతరాల ఆనవా యితి ని మార్చి సీతా రాముల కల్యాణం చేసారు. అడవిలో అనువైన చెట్లు దొరకక పోవటంతో చిత్ర పటాన్ని వుంచి  సీతారాముల కల్యాణం చేసారు. మంచిగా చలువ పందిరి వేసి భక్తీ శ్రద్దలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.