గణపయ్య చేతిలో లడ్డూనే ఎందుకు పెడతారో తెలుసా?

Updated on: Aug 21, 2025 | 4:05 PM

వినాయక చవితి వచ్చేస్తుంది. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో గణేష్ చతుర్థి ఒకటి. అయితే 2025 వ సంవత్సరంలో ఆగస్టు 27 బుధవారం రోజున వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోనున్నారు. ఇక వినాయక చవితి అనగానే అందరికీ వినాయకుడి విగ్రహం, మండపంతో పాటు లడ్డూ గుర్తుకు వస్తది. తప్పకుండా వినాయకుడి చేతిలో లడ్డూ పెడుతారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వినాయకుడి చేతిలో లడ్డూనే ఎందుకు పెడతారు. దీని వెనకున్న కథఏంటో..కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
వినాయకుడి పండుగ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పండగ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. చిన్న పిల్లలు మట్టితో వినాయకుడిని తయారు చేసి నిత్యం పూజలుచేసి మురిసిపోతారు. తొమ్మిది రోజుల పాటు గణపయ్యకు పూజలు, భజనలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. ఇక పెద్ద వారు సైతం వినాయక చవతి పండుగను చాలా ఆనదంగా జరుపుకుంటారు.

2 / 5
ఇక పండగ రాబోతుంది అంటే చాలు ప్రతి ఒక్కరూ ఎలాంటి డిజైన్‌తో మండపం వేయాలి. అన్నదానం, చందాలు వసూలు చేయడం, ఎంత పెద్ద లడ్డూ కొనుగోలు చేయాలని లెక్కలు వేసుకుంటారు. ముఖ్యంగా గణపయ్య చేతిలో పెట్టే లడ్డూ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది.  అయితే ఇలా గణపయ్యకు నైవేద్యంగా లడ్డూ ప్రసాదమే పెట్టడం వెనుక ఓ కథ ఉన్నదంట. అద ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

3 / 5
పురాణాల ప్రకారం లడ్డూ అంటే వినాయకుడికి చాలా ఇష్టం అంట. ప్రతి రోజూ ఆయన లడ్డూ లేకుండా భోజనం చేసేవాడే కదాంట. అంతే కాకుండా దీనికి సంబంధించి ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒక సారి కార్తికేయుడికి వినాయకుడికి పోటీ పెట్టారు. ఈ ప్రపంచాన్ని మూడు సార్లు ప్రదక్షణ ఎవరు చేస్తారో వారు పోటీలో విజేతలని చెబుతారు. ఆ సమయంలో కార్తికేయ తన మయూరంపై ప్రపంచాన్ని చుట్టేస్తే, వినాయకుడు మాత్రం శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.. తల్లిదండ్రులే తన ప్రపంచమని చెబుతాడు. ఆ సమయంలో వినాయకుడి తెలివి, జ్ఞాన్ని  మెచ్చిన శివ పార్వతులు గణపయ్యకు లడ్డూ ప్రసాదంగా ఇస్తారంట. అప్పటి నుంచి వినాయకుడికి లడ్డూ అంటే చాలా ఇష్టం. అందుకే గణపయ్యకు ఇష్టమైన నైవేద్యంగా దీనికి ప్రత్యేక స్థానం లభించిందంట.

4 / 5
అలాగే గణపతి చేతిలో ఉండే లడ్డూ అనేది జ్ఞానం, ఆనందం, సపూర్ణత్వానికి సూచనంటే. దీనిని తినడం వలన మంచి జ్ఞానాన్ని పొందడమే కాకుండా సంతోషాన్ని కూడా పొందుతారని చెబుతుంటారు పండితులు. అందుకే చాలా మంది దీనిని ఎక్కువ డబ్బులు పెట్టి వేలంలో కొనుగోలు చేస్తుంటారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.