
వృషభం: ఈ రాశికి శని, రాహు, గురు, శుక్ర, బుధ, రవులు అనుకూలంగా మారడం ఒక గొప్ప విశేషం. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి కటాక్షం అపారంగా లభిస్తుంది. సాధారణంగా ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, మరింత మంచి ఉద్యోగంలోకి మారడం, విదేశాల్లో ఉద్యోగం సంపాదించడం వంటివి జరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.

మిథునం: రాశ్యధిపతి బుధుడితో పాటు రవి, కుజ, గురు, శనులు అనుకూలంగా మారడం వల్ల వీరు అనేక విషయాల్లో అదృష్టవంతులవుతారు. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లోనే కాక పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.

కన్య: రాశ్యధిపతి బుధుడు ఉచ్ఛ స్థితిలో రవితో కలిసి ఉండడం, గురు, రాహు, శనులు కూడా అనుకూలంగా ఉండడం వల్ల రాజకీయ ప్రాబల్యం బాగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో పాటు, ఒక ప్రముఖుడుగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. విదేశీయానానికి, విదేశీ ఉద్యోగాలకు మార్గం సుగమం అవుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.

తుల: ఈ రాశికి శని, రాహు, గురువు, శుక్ర, రవుల అనుకూలత వల్ల పదోన్నతికి బాగా అవకాశం ఉంది. ఏ రంగంలో ఉన్నవారైనా ఉన్నత పదవులు చేపట్టడం జరుగుతుంది. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు ఇతర దేశాల నుంచి ఊహించని ఆఫర్లు అందుతాయి. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యక్తిగత, ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. రాజపూజ్యాలు కలుగుతాయి.

మకరం: ఈ రాశికి శని, రాహువులతో పాటు, రవి, బుధ, కుజులు అనుకూలంగా మారడం వల్ల జీవితం సుసంపన్నంగా మారుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు, భారీగా జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది.

కుంభం: గ్రహ బలం వల్ల ఈ రాశివారికి ఏలిన్నాటి శని ప్రభావం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ రాశికి శని, గురువు, శుక్రుడు, బుధుడు, కుజుడు అనుకూలంగా మారడం వల్ల ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఒక సంస్థకు ఉన్నతాధికారి అయ్యే అవకాశం కూడా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా ఇతర ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ అంచనాలకు మించి లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. విదేశీ ఆఫర్లు ఎక్కువగా అందుతాయి.