
హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ మద్యకాలంలో విలన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. తన సినిమాలతో తెలుగు తమిళ్ ప్రేక్షకులను అలరించే అర్జున్ కు దైవ బక్తి కూడా ఎక్కువే..

తెలుగులో నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 2004లో వచ్చిన శ్రీ ఆంజనేయం సినిమాలో హనుమంతుడి గా నటించారు అర్జున్. అప్పటినుంచి హనుమంతుడి పట్ల భక్తిని పెంచుకున్నారు ఈ యాక్షన్ కింగ్ అర్జున్.

అయితే అప్పటినుంచి హనుమంతుడికి గుడి కట్టాలని కలగన్నారు. 17 ఏళ్ల తర్వాత అర్జున్ కల నెరవేరింది.

చెన్నైలో కర్ణాటక శిల్పి అశోక్ గుడిగర్ సారథ్యంలో 35 అడుగుల ఎత్తైన హనుమంతుడి ఏకశిలా విగ్రహాన్ని ప్రతిష్టింపజేశారు అర్జున్

ఆలయ పూజ, ప్రారంభ కార్యక్రమంలో కుటుంబసభ్యులతో కలిసి దిగిన ఫొటోలు ఆన్ లైన్ లోచక్కర్లు కొడుతున్నాయి.
