
టమాటో ఎండు చేపల కూరకు కావాల్సిన పదార్థాలు : ఎండు చేపలు వంద గ్రాములు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, చింత పండు రసం , మిరియాల పొడి, మెంతి పొడి, కరివేపాకు, కొత్తిమీర, పూదీనా, నూనె, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు.

తయారీ విధానం : ముందుగా ఎండు చేపలను తీసుకొని వాటి తలలు తీసి వేయాలి. దీని వలన చేదు రాకుండా, నీచు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత వీటిని పెనంపై రెండు లేదా మూడు నిమిషాలు వేయించాలి. తర్వాత గోరు వెచ్చటి నీటిలో దాదాపు పదినిమిషాలు నానబెట్టాలి.

ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేయాలి. దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో కర్రీకి సరిపడ నూనె పోసుకోవాలి అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండు చేపలను వేసి దాదాపు 5 నిమిషాలు నూనెలో బాగా వేగేలా చూసుకోవాలి.

ఇప్పుడు అందులోనే టమాటాలు వేయాలి. ఇవి బాగా ఉడికేలా చూసుకోవాలి. అప్పుడే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కాస్త ఉడికిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి ,మెంతి పొడి వేసి బాగా ఉడకబెట్టాలి. వీలైతే కొంచెం చింత పండు రసం వేయాలి. అంతే కర్రీ చాలా టేస్టీగా బాగా ఉడుకుతుంది.

ఇలా చింత పండు రసం వేయడం వలన కూర మంచిగా ఉండటమే కాకుండా, కాస్త పులుపు రుచిని ఇస్తుంది. ఇప్పుడు కొత్తిమీర, కొంచెం పూదీన వేసుకోవాలి. మరో పదినిమిషాలు గ్యాస్ పై ఉడకనివ్వాలి. అంతే టేస్టీ టేస్టీ టమాటా ఎండు చేపల కర్రీ రెడీ. ఇలా వండి పెడితే ఇంటిలోని వారు కడుపు నిండా తింటారు.