
బెర్రీస్ గురించి వినే ఉంటారు. బెర్రీస్‌లో చాలా రకాలు ఉన్నాయి. కానీ చాలమందికి కేవలం స్ట్రాబెర్రీస్ గురించి మాత్రమే తెలుసు. స్ట్రాబెర్రీస్ కూడా రుచిగానే ఉంటాయి. కానీ బెర్రీస్ జాతికి చెందిన పండ్లలో బ్లూ బెర్రీలు కూడా ఒకటి. ఇవి చూడటానికి నీలి రంగులో గోలీల్లా కనిపిస్తాయి.

ఇవి చూసేందుకు చిన్న సైజులో కనిపించినా.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. బ్లూ బెర్రీస్ పండ్లలో ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఈ చిన్న పండ్లు తినడం వల్ల చాలా రకాల సమస్యలను కంట్రోల్ చేయవచ్చు.

బ్లూబెర్రీలలో ఆంథోసైనిన్స్ అనే మూలకాలు సమృద్ధిగా లభిస్తాయి.. బ్లూబెర్రీస్ విటమిన్ ఎ, సి , ఇలను కలిగి ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ విటమిన్లు కాలుష్యం, UV కిరణాల నుండి చర్మానికి పూర్తి రక్షణను అందిస్తాయి. బ్లూబెర్రీస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ప్రభావాలను నెమ్మదిస్తాయి. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఇది వాపును తగ్గిస్తుంది. చర్మం యవ్వనాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

మెదడు పనితీరును మెరుగు పరిచి, యాక్టీవ్‌గా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. బ్లూ బెర్రీస్ తినడం వల్ల.. బీపీ, డయాబెటీస్, మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. కీళ్ల నొప్పులు, కడుపులో నొప్పి, వాంతులు వంటివి కంట్రోల్ చేయడంలో సహాయ పడుతుంది.

తరచూ వీటిని తినడం వల్ల మూత్ర విసర్జణ సమస్యలు కంట్రోల్ అవుతాయి. శరీరంలోని మలినాలు, విష పదార్థాలను, ఫ్రీ రాడికల్స్‌ని నియంత్రిస్తుంది. జీర్ణ క్రియను కూడా వేగవంతంగా చేస్తుంది. జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.