Subhash Goud |
Updated on: Mar 27, 2022 | 8:34 PM
Signy Battery: లిథియం-అయాన్ బ్యాటరీలను తయారు చేస్తున్న సిగ్నీ.. హైదరాబాద్ సమీపంలో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ఇందుకు రూ.300 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. దాదాపు ఏడాదికి 40 వేల బ్యాటరీల తయారీ సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
లిథియం-అయాన్ బ్యాటరీలను ఎలక్ట్రిక్ వాహనాల్లో, టెలికాం టవర్లు నిర్వహణ మొదలైన చోట్ల వినియోగిస్తున్నారు.
విస్తరణ ప్రణాళికలకు అవసరమైన నిధుల కోసం 70 లక్షల నుంచి కోటి డాలర్లను రుణాలు, ఈక్విటీ రూపంలో సమకూర్చుకోవాలని సిగ్నీ యోచిస్తోంది.