AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects of Almond: ఆరోగ్యానికి మంచిది కదా అని వీటిని అతిగా తింటున్నారా? జాగ్రత్త ఈ సమస్యలు వస్తాయ్‌..

డ్రైఫ్రూట్స్‌లో బాదం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రుచితోపాటు తక్షణ శక్తిని, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. బాదంలో మోనో అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో విటమిన్‌-ఇ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక పిండిపదార్థాలుండే ఆహారానికి బదులుగా వీటిని తీసుకుని బరువును..

Srilakshmi C
|

Updated on: Oct 29, 2023 | 3:36 PM

Share
మధుమేహంతో బాధపడేవారు బాదం నూనెతో చేసిన ఆహారాన్ని తినొచ్చు. ఆల్మండ్ ఆయిల్‌లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థలో చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిల్లో ఆకస్మిక పెరుగుదలను నివారిస్తుంది.

1 / 5
అధిక పిండిపదార్థాలుండే ఆహారానికి బదులుగా వీటిని తీసుకుని బరువును నియంత్రించుకోవచ్చు. దీనిలోని విటమిన్‌-ఇ చర్మంలోని కొల్లాజెన్‌ను రక్షించి యవ్వనంగా ఉండేలా చేస్తుంది. జుట్టు సమస్యలను కూడా తగ్గిస్తుంది.

2 / 5
రోజూ గుప్పెడు బాదం తింటే కావాల్సిన శక్తి లభించడమే కాకుండా కడుపు నిండిన భావన కలిగి అధిక సమయం ఆకలి వేయకుండ ఉంటుంది. అయితే వీటిని నేరుగా కాకుండా నానబెట్టి పొట్టు తీసి తింటే పోషకాలు శరీరానికి అందుతాయి.

3 / 5
మెదడు అభివృద్ధికి తోడ్పడటంతోపాటు ఎముకలు, దంతాలు బలంగా మారేలా చేస్తుంది. రక్తహీనత నుంచి కాపాడుతుంది. అయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల విటమిన్ ఓవర్ డోస్ వస్తుందనే విషయం చాలా మందికి తెలియదు.

4 / 5
ఎక్కువ వేయించిన ఆహారాన్ని తింటే, కొలెస్ట్రాల్‌తో పాటు బరువు కూడా పెరుగుతుంది. అయితే బాదం నూనెతో చేసిన ఆహారపదార్థాలు తింటే బరువు పెరుగుతారనే భయం అక్కరలేదు. బాదం నూనెలో కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని అరికట్టడంలో, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

5 / 5