- Telugu News Photo Gallery Science photos Aliens News Alien species Could Hitchhike on Human Spacecraft and Contaminate Earth Here is The Full Details
Aliens News: భూమిపైకి గ్రహాంతర వాసులు వస్తున్నారా?.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు..!
Aliens News: బయోసైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనంలో గ్రహాంతర వాసుల గురించి సంచలన విషయాలను పేర్కొంది. త్వరలో గ్రహాంతరవాసులు భూమిపైకి రాబోతున్నారని తెలిపింది. దీనికి మనుషులు సిద్ధం కావాలంటూ హెచ్చరించింది.
Updated on: Nov 28, 2021 | 6:30 AM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష సంస్థలు గ్రహాంతరవాసుల కోసం వేట సాగిస్తున్నాయనే విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జరిపిన ఓ అధ్యయనం ప్రకారం.. అంతరిక్ష పరిశోధనలలో గణనీయమైన పెరుగుదల కారణంగా గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానవ అంతరిక్ష నౌక మరో గ్రహం నుండి గ్రహాంతర జీవులను తమతో తిరిగి భూమికి తీసుకురాగలదని సదరు అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఈ సిద్ధాంతం మానవ జాతి చరిత్రపై ఆధారపడింది. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు తెరపైకి వచ్చాయి. మనుషుల కారణంగా గతంలోనూ అనేక జంతువులు భూమిపైకి వచ్చాయి. అవి భూమిపై నివసించే జాతులను నాశనం చేశాయి. తూర్పు ఆసియా నుండి షిప్పింగ్ బాక్స్‌ల్లో అమెరికాకు చేరిన బగ్ దీనికి ఉదాహరణ.

బయోసైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనం ప్రకారం, గ్రహాంతర జాతుల విషయంలో కూడా అదే జరగవచ్చు అని అభిప్రాయపడింది. లేదంటే.. మనుషులే భూమిపై ఉన్న జీవులను ఇతర గ్రహాలకు తరలించి వాటిని వాతావరణాన్ని కలుషితం చేయొచ్చు అని పరిశోధకులు తమ కథనంలో రాశారు. అంతరిక్ష పరిశోధన, వాణిజ్య ఉపయోగం కోసం ప్రణాళిక వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో శాస్త్రవేత్తల అధ్యయనం ఇలా అభిప్రాయపడటం చర్చనీయాంశమైంది.

'భూమి నుంచి ఇతర గ్రహాలకు, ఇతర గ్రహాల నుంచి భూమికి గ్రహాంతర జీవుల రాకను నిరోధించేందుకు ప్రోటోకాల్ అవసరం' అని కథనంలో పేర్కొన్నారు. అంతరిక్ష యాత్రలను ప్లాన్ చేస్తున్నప్పుడు జీవ కాలుష్యం ప్రమాదాన్ని తగినంతగా పరిగణించబడటం లేదని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

'భూమిపై ఏదైనా జీవసంబంధమైన సమస్యను ఎదుర్కోవటానికి ముందస్తుగా గుర్తించడం, ప్రమాద అంచనా, వేగవంతమైన ప్రతిస్పందన, నివారణ విధానాల కోసం ప్రస్తుతం ప్రోటోకాల్‌లు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, గ్రహాంతరవాసులను భూమికి తీసుకురాకుండా నిరోధించడానికి కూడా ఇలాంటి ప్రోటోకాల్‌లను రూపొందించాలి.’ అని పేర్కొన్నారు.

ఇన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, గ్రహాంతర జీవులు భూమికి చేరే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతరిక్ష ప్రయాణానికి సంబంధించి కఠినమైన పరిస్థితులు.. ఒక జీవి మరొక గ్రహం నుండి భూమిపైకి వచ్చే ప్రయాణంలో జీవించడం చాలా కష్టతరంగా ఉంటుందని అంచనా వేశారు.




