Summer Effect: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్.. బయటకు వెళ్లాలంటే ఈ సూచనలు తప్పనిసరి..
ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో వేసవి తీవ్రంగానే ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఏపీలోనూ ఉష్ణతాపం తీవ్రంగానే ఉంటుంది. బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.మార్చి నుంచి మే వరకు మూడు నెలలు వేసవి సీజన్‌గా పరిగణిస్తారు. ఈ మూడు నెలల్లోకెల్లా మే నెలలో ఉష్ణతీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 5–8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.