నేటికాలంలో రిఫ్రిజిరేటర్లు లేకుండా జనజీవనం దాదాపు అసాధ్యంగా మారింది. దాదాపు ప్రతి ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉంటున్నాయి. వండిన ఆహారం,పాలు, పచ్చి కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు వంటివి కొన్ని రోజులపాటు తాజాగా ఉండాలంటే రిఫ్రిజిరేటర్‌పైనే ఆధారపడుతున్నారు. ఇక వేసవిలో చల్లని నీరు, ఐస్ కోసం రిఫ్రిజిరేటర్ తప్పనిసరైపోయింది.