- Telugu News Photo Gallery Raksha bandhan 2023 mehendi try these beautiful mehndi designs for hand in teluugu
Mehandi Designs: రాఖీ పండగక్కి మెహందీతో చేతులను అలంకరించుకోవాలనుకుంటున్నారా.. సింపుల్ డిజైన్స్ మీ కోసం..
శ్రావణ మాసం వచ్చేసింది. పండగల శుభకార్యాల సందడి నెలకొంటుంది. ముఖ్యంగా అక్కా చెల్లెలు ఎంతో ఆతృతగా ఎదురుచూసే రాఖీ పండగ ఆగష్టు 30వ తేదీన జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అందమైన మెహందీ డిజైన్‌లతో మీ చేతులను అలంకరించుకోండి. రాఖీ పండగ సందర్భంగా అందమైన, అధునాతన మెహందీ డిజైన్‌లతో చేతులను అందంగా అలంకరించుకోండి.
Updated on: Jul 28, 2023 | 11:04 AM

రక్షా బంధన్ వంటి ప్రత్యేక సందర్భాలలో మహిళలు తమ చేతులను మెహందీతో అందంగా అలంకరించుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. అటువంటి పరిస్థితిలో కొత్త కొత్త మెహందీ డిజైన్ల కోసం చూస్తున్నట్లయితే.. కొన్ని రకాల డిజైన్స్ ను మీకు ఈ రోజు పరిచయం చేస్తున్నాం.. ఈ మెహందీ డిజైన్‌లు మీ చేతుల అందాన్ని మరింత పెంచుతాయి.

బ్రాస్లెట్ డిజైన్ - మీరు మణికట్టు మీద బ్రాస్లెట్ స్టైల్ లో మెహందీ డిజైన్ ను ఎంపిక చేసుకోవచ్చు. దీని కోసం మణికట్టు దగ్గర రెండు వైపులా డిజైన్ తో అలంకరించుకోండి. ఇది బ్రాస్లెట్ లాగా ఉంటుంది. ఈ రకమైన మెహందీ డిజైన్ మీ చేతులకు సింపుల్ గా అద్భుతంగా కనిపిస్తుంది.

నెమలి డిజైన్ - సాంప్రదాయ నెమలి డిజైన్ మెహందీ ఎప్పటికీ ట్రెండ్ ను సృష్టిస్తూనే ఉంది. ఈ మెహందీ డిజైన్‌లో నెమళ్లను వేయడంతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ మెహందీ డిజైన్‌తో మీరు వేళ్లను ఖాళీగా ఉంచుకోవచ్చు లేదా పూర్తిగా వేళ్లను కూడా మెహందీ డిజైన్‌తో నింపేసుకోవచ్చు.

మండల మెహందీ - ఈ మెహందీ డిజైన్ ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉంది. మీరు మండల మెహందీతో చేతులను కూడా అలంకరించుకోవచ్చు. ఈ మెహందీ డిజైన్ చాలా సరళంగా, సొగసైనదిగా కనిపిస్తుంది.

చేయి వెనుక డిజైన్ - మీరు మీ చేతులకు పూర్తి హెన్నా డిజైన్ తో నింపడం ఇష్టం లేకపోతె, అప్పుడు చేతి వెనుక డిజైన్ వేసుకోవచ్చు. చేతి వెనుక భాగంలో రౌండ్ మెహందీ డిజైన్ లేదా అరబిక్ డిజైన్ బెస్ట్ లుక్ ఇస్తుంది.




