AP Rains: ద్రోణి ఎఫెక్ట్.. ఉరుములు, మెరుపులతో ఏపీలో వర్షాలు.. ఎక్కడెక్కడంటే..?

| Edited By: Ravi Kiran

Mar 20, 2024 | 1:44 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు రోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.

1 / 5
ఝార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిస్సామీదుగా ఉత్తర కోస్తా వరకు ద్రోణీ ఆవరించి ఉంది.  వీటి ప్రభావంతో కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని విశాఖలోని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

2 / 5
కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లోని ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. కాగా, శ్రీకాకుళం, విజయనగరం విశాఖ, అల్లూరి, మన్యం పార్వతీపురం జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఓ మోస్తారు వర్షాలు పడతాయన్నారు.

3 / 5
అదే విధంగా దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షం పడుతుందన్నారు. నిన్నటి నుంచి ఈ ఉదయం వరకు ఉత్తరాంధ్ర జిల్లాలోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. విజయనగరం జిల్లా గరివిడిలో 13 సెంటీమీటర్లు,, అల్లూరి జిల్లాలో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది.

4 / 5
మిగిలిన కొన్ని ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్‌ సునంద తెలిపారు. ఇదిలా ఉంటే విశాఖ, అనకాపల్లి, పాడేరు ఏజెన్సీలోనూ లో  ఉదయం నుంచి వర్షం పడుతోంది. చాలా చోట్ల ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి.

5 / 5
 పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని.. చెట్లు, టవర్స్, పోల్స్ కింద ఉండరాదన్నారు. పొలాలు, మైదానాలు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా.. సురక్షితమైన ప్రదేశాలను ఆశ్రయించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది.