AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇస్త్రీ చేసే పని ఉండదు.. వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్కటి వేస్తే జరిగే మ్యాజిక్ ఇదే..

ఉదయాన్నే ఆఫీసుకో లేదా అర్జెంట్ మీటింగ్‌కో వెళ్లాలి.. తీరా చూస్తే ఇష్టమైన డ్రెస్ ముడతలు పడి ఉంటుంది. అప్పటికప్పుడు ఇస్త్రీ చేయడం అంటే ఎంతో విసుగుతో కూడిన పని. కానీ ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిన్న చిట్కా తెలిస్తే.. మీరు ఐరన్ బాక్స్‌తో పని లేకుండానే మీ బట్టలను ఇస్త్రీ చేసినట్లుగా మెరిపించవచ్చు. దీనికోసం మీరు చేయాల్సిందల్లా మీ వాషింగ్ మెషీన్ డ్రైయర్‌లో కేవలం మూడు ఐస్ క్యూబ్స్ వేయడమే..

Krishna S
|

Updated on: Mar 24, 2026 | 6:13 PM

Share
ఇప్పుడు అందరి ఇళ్లలో వాషింగ్ మెషిన్లు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ మెషిన్లలో డ్రైయర్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీనివల్ల బట్టలు 100శాతం ఆరడంతో పాటు డ్రైయర్ సపరేట్ కొనాల్సిన అవసరం ఉండదు. బట్టలు ఉతికిన తర్వాత డ్రైయర్‌ సమయంలో అందులో 2 నుండి 3 ఐస్ క్యూబ్స్ వేయండి. డ్రైయర్ రన్ అవుతున్నప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ కరిగి ఆవిరిగా మారుతాయి. ఈ ఆవిరి బట్టల దారాల్లోకి చొచ్చుకుపోయి ముడతలను మృదువుగా చేస్తుంది. డ్రైయర్ ఆగిపోయే సమయానికి మీ బట్టలు ఇస్త్రీ చేసినట్లుగా, చాలా ఫ్రెష్‌గా బయటకు వస్తాయి.

1 / 5
టెక్స్‌టైల్ రీసెర్చ్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. వేడి గాలిలో తేమ స్థాయి పెరిగినప్పుడు, నూలు, సింథటిక్ ఫైబర్‌లు త్వరగా వాటి సాధారణ స్థితికి వస్తాయి. ఈ పద్ధతిని స్టీమ్ రిలాక్సేషన్ అని పిలుస్తారు. దీని ద్వారా బట్టలలోని 80 శాతం ముడతలను సులభంగా తొలగించవచ్చని పరిశోధకులు నిర్ధారించారు.

2 / 5
ఒకవేళ మీ ఇంట్లో డ్రైయర్ సదుపాయం లేకపోయినా చింతించకండి. తెల్ల వెనిగర్‌తో మీరు సొంతంగా రింకిల్ రిమూవర్ స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఒక వంతు తెల్ల వెనిగర్, మూడు వంతుల నీటిని కలిపి ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోండి. ముడతలు పడిన బట్టలను హ్యాంగర్‌కు తగిలించి, ఈ మిశ్రమాన్ని లైట్‌గా స్ప్రే చేయండి. బట్టలు ఆరే కొద్దీ అందులోని ముడతలు వాటంతట అవే మాయమైపోతాయి.

3 / 5
లాభాలు: గంటల కొద్దీ ఇస్త్రీ చేసే శ్రమ తప్పడంతో పాటు ఐరన్ బాక్స్ వాడకం తగ్గడం వల్ల కరెంట్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. మితిమీరిన వేడితో ఇస్త్రీ చేయడం వల్ల బట్టల రంగు వెలిసిపోయే ప్రమాదం ఉంది. కానీ ఈ సహజ ఆవిరి పద్ధతి వల్ల బట్టల నాణ్యత చెక్కుచెదరకుండా ఉంటుంది.

4 / 5
డ్రైయర్‌లో మరీ ఎక్కువ బట్టలు వేయకండి. గాలి ఆడటానికి తగినంత ఖాళీ ఉంటేనే ఐస్ క్యూబ్స్ ఆవిరి బాగా పనిచేస్తుంది. డ్రైయర్ ఆగిపోగానే బట్టలను వెంటనే బయటకు తీసి హ్యాంగర్‌కు తగిలించాలి. లేదంటే మళ్ళీ ముడతలు పడే అవకాశం ఉంది. కాగా బిజీ లైఫ్‌లో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మన పనిని సులభతరం చేస్తాయి. తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో మీ బట్టలను కొత్తవాటిలా ఉంచుకోవడానికి ఈ పద్ధతిని తప్పకుండా ప్రయత్నించండి..

5 / 5
Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..

పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని

వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!

సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?

శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్

ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట

మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?

OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్