
అందాల చిన్న మౌనరాగం ఫేమ్ ప్రియాంక జైన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు తీసి పోని అదంతో ఈ ముద్దుగుమ్మ నెట్టింట తెగ సందడి చేస్తుంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ప్రియుడితో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తుండేది. కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ వరలక్ష్మీ వ్రతం ఆచరించి, సంప్రదాయ పద్ధతిలో రెడీ అయిన ఫొటోస్ షేర్ చేసింది.

పట్టు చీరలో అందంగా అలంకరించుకొని ఉన్న ఈ బ్యూటీని చూస్తే రెండు కళ్లు సరిపోవు. అంత అందంగా ముద్దుగా రెడీ అయ్యింది. ఇక ఈ అమ్మడు నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుంచి వీళ్లు రిలేషన్‌లో ఉన్నట్లు సమాచారం. ఇక చాలా రోజుల నుంచి వీరి పెళ్లి వార్తలపై అనేక గాసిప్స్ వస్తున్నాయి. ఎంగేజ్ మెంట్, త్వరలో పెళ్లి అంటూ అనేక వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. కానీ వీటిపై ఎప్పుడూ ఈ బ్యూటీ క్లారిటీ ఇవ్వలేదు.

ఇక రీసెంట్ గా ఈ చిన్నది తన ప్రియుడితో కలిసి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంది. తనకు కాబోయే భర్తతో పూజలు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట షేర్ చేయడంతో ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కపుల్ క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ప్రియాంకజైన్ మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి, చెల్తే చల్తే అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ అమ్మడుకు అంతగా ఫేమ్ రాలేదనే చెప్పాలి. కానీ సీరియల్స్ ద్వారా స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో పాపులారిటీ సొంతం చేసుకుంది.

తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తన ఆట,మాటతీరుతో ఎంతో మంది మనసు దోచుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఈ బ్యూటీ తన గ్లామర్ డోస్ పెంచిందనే చెప్పాలి. ఎప్పుడూ తన గ్లామర్ ఫొటోస్ షేర్ చేస్తూ రచ్చ చేసేది. కానీ తాజాగా వరలక్ష్మీ వ్రతం ఫొటోలు షేర్ చేసి అందరినీ ఆకట్టుకుంటుంది.