- Telugu News Photo Gallery Political photos Tirupati by election tdp leader nara lokesh different variety campaign in tirupati by poll
Tirupati by Election: ఉప ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు.. జనంతో మమేకమవుతున్న లోకేష్..
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు.
Updated on: Apr 13, 2021 | 10:26 PM

తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇదే క్రమంలో రోడ్డు పక్కన షాపు కనిపిస్తే చాలు అక్కడ వాలిపోతున్నారు. చాయ్ పెడుతున్నారు? వేడి వేడి వడలు వేస్తున్నారు? దీంతో తెలుగు తమ్ములు మా చినబాబు సూపర్ అంటూ సంబరపడుతున్నారు.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు అన్నీ దూకుడు పెంచాయి. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వైరెటీ ప్రచారాలతో ఆకట్టుకుంటున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో రోడ్డు పక్కన కనిపించిన షాపుల దగ్గర ఆగుతూ.. అక్కడ పనివాళ్ల కష్ట సుఖాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు ఓ టిఫిన్ షాపుకు వెళ్లిన ఆయన వేడి వేడి వడలు వేశారు.

టీడీపీ సానుభూతి పరులు, కార్యకర్తల ఇంటికి స్వయంగా వెళ్తూ వారి కష్ట, నష్టాలను వింటున్నారు లోకేష్. ప్రభుత్వం తమపై కక్ష కట్టిందని వారు లోకేష్ కు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై స్పందించిన లోకేష్.. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని.. అన్ని విధాల కేడర్ ను కాపాడుకుంటామని.. ఎవరూ అధైర్య పడొద్దని ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు.

ఓవైపు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూనే.. టీడీపీ గెలిస్తే ఏం చేస్తారన్నది స్పష్టంగా చెబుతున్నారు. స్థానిక ప్రజలతో మమేకమైపోతే ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు, లోకేష్ తో షేక్ హ్యాండ్ లకు.. సెల్ఫీలకు తిరుపతి వాసులు సైతం భారీగానే పోటీ పడుతున్నారు.

చిన్న పిల్లలు ఎక్కడ కనిపించినా లోకేష్ వారిని వదలడం లేదు. చక్కగా లాలిస్తున్నారు, ఆడిస్తున్నారు. దేవాన్ష్ తో ఆడుకోవడం బాగా అలవాటై.. చిన్నపిల్లలను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. లోకేష్ ఎక్కడ ప్రచారానికి వెళ్లినా అక్కడ పిల్లలు కనిపిస్తే వారిని ఎత్తుకుని ముద్దులాడుతున్నారు. కాసేపు వారితో ఆడుకుంటున్నారు.

ప్రచారంలో భాగంగా చెప్పులు కుట్టే వ్యక్తి దగ్గరకు వెళ్లిన లోకేష్ ఆయన్న ఆప్యాయంగా పలకరించారు. పెన్షన్ నెల నెలా అందుతోందా? సంక్షేమ పథకాలు సమయానికి చేరుతున్నాయా? అని అడిగారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అందరి కష్టాలు తీరుతాయని వారికి భరోసా కల్పించారు.

తిరుపతి టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరుపున నారా లోకేష్ పలు గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నారు. అలా రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ చాయ్ వాలా దగ్గర ఆగి.. టీ తాగి కాసేపు ముచ్చట్లు పెట్టారు. స్టార్ హోటల్ లో కూడా టేస్ట్ రాదంటూ టీ సేవించారు.
