
గుజరాత్‌లోని సూరత్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ సముదాయమైన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని నరేంద్ర మోదీ డిసెంబర్ 17వ తేదీన ప్రారంభించనున్నారు. డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో నిర్మితమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది.

ఈ బిల్డింగ్‌ను రూ. 3500 కోట్లతో నిర్మించారు. మొత్తం 35.54 ఎకరాల్లో సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని నిర్మించారు. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ బిల్డింగ్ విస్తరించి ఉంది.

9 గ్రౌండ్ టవర్లు, 15 అంతస్తుల్లో దీని నిర్మాణం చేపట్టారు. 300 చదరపు అడుగుల నుండి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్ కనెక్టడ్ భవనంగా నిలిచింది.

ఈ బిల్డింగ్‌లో సుమారు 4700 కార్యాలయాలనున్నాయి. వీటిలో ఇప్పటికే 130 కార్యాలయాలు ఉపయోగంలోకి వచ్చేశాయి. పెంటగాన్ కంటే ఈ భవనం పెద్దదని చెబుతున్నారు.

ఈ బిల్డింగ్ వజ్రాల వ్యాపారినికి ప్రంపచం కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ క్యాంపస్‌లో సేఫ్ డిపాజిట్ వాల్ట్‌లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్సస్ హాల్స్, రెస్టారంట్స్, కన్వెక్షన్ సెంటర్ ఇలా ఎన్నో వసతులను అందుబాటులోకి తీసుకొచ్చారు.