PM Modi in G7 Summit: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీకి ఎలా స్వాగతం పలికారో చూశారా..?

|

Jun 14, 2024 | 8:31 PM

1 / 7
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఘన స్వాగతం పలికారు.  జీ-7 సదస్సులో భారత్ 'ఔట్‌రీచ్ నేషన్'గా పాల్గొంటోంది. జీ7 ఔట్‌రీచ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం (జూన్ 13)ఇటలీలోని అపులియా చేరుకున్నారు.

2 / 7
జీ7 శిఖరాగ్ర సదస్సులో 'ఔట్‌రీచ్ సెషన్'లో పాల్గొనేందుకు అపులుగా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ సంస్కృతి ప్రకారం నమస్కారం చేస్తూ స్వాగతం పలికారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ.

3 / 7
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఎనర్జీ, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతంపై దృష్టి సారించి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిర్వహించే సెషన్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

4 / 7
మూడోసారి ప్రధాని అయ్యిన తర్వాత తొలి విదేశీ పర్యటనకు ఇటలీ రావడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు.

5 / 7
 రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో గణనీయమైన కృషి చేసిన ఇటలీ ప్రధాన మంత్రి మెలోని భారతదేశ పర్యటనను ప్రధాని గుర్తు చేసుకున్నారు.

6 / 7
భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ఇండో-పసిఫిక్, మధ్యధరా ప్రాంతాలలో సహకారాన్ని పెంపొందించడానికి కట్టుబడి ఉన్నామని ఇరు దేశాల అధినేతలు స్పష్టం చేశారు.

7 / 7
ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు, ఉజ్వల భవిష్యత్తు కోసం అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించేందుకు జీ-7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నేతలతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరిపారు.