- Telugu News Photo Gallery Technology photos Oneplus launching new budget smartphone Oneplus Nord CE 4 Lite features and price details
OnePlus: వన్‌ప్లస్ నుంచి బడ్జెట్ ఫోన్ వచ్చేస్తోంది.. తక్కువ ధరలోనే..
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్‌కు భారత మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట్లో ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొచ్చిన వన్‌ప్లస్ ఆ తర్వాత బడ్జెట్ ధరలో ఫోన్‌లను తీసుకొస్తూ బడ్జెట్ మార్కెట్‌ను సైతం హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది...
Updated on: Jun 15, 2024 | 9:41 AM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జూన్ 18వ తేదీన భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందిస్తున్నారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ ఫోన్‌లో 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్ రూ. 20 వేలలోపు ఉండొచ్చని అంచనావేస్తున్నారు. జూన్ 18వ తేదీన దీనిపై క్లారిటీ రానుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన సెకండరీ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

సెక్యూరిటీ పరంగా ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను అందించారు. అలాగే 3.5 ఎమ్‌ఎమ్ ఆడియో జాక్, స్టీరియో స్పీకర్స్‌ను ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో 5జీ, బ్లూటూత్ 5.2, జీపీఎస్,యూఎస్‌బీ టైప్‌సీ వంటి ఫీచర్లను అందించారు.




