- Telugu News Photo Gallery Technology photos Whatsapp planning to introduce new feature Able To Easily Transfer Chat History From Old Phone
WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇకపై చాట్ బ్యాకప్ మరింత సులువు
ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్ ప్రధానమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ నిలిచింది. ఇందులోని ఫీచర్లు, ప్రత్యేకతలు వాట్సాప్‌ను ఈ స్థాయిలో నిలిపింది. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది..
Updated on: Jun 14, 2024 | 9:47 AM

వాట్సాప్ ఉపయోగించే వారికి ఎదురయ్యే సమస్యల్లో వాట్సాప్ చాట్ బ్యాకప్ ఒకటి. కొత్త మొబైల్ ఫోన్ తీసుకున్నా, ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసినా పాత మెసేజ్‌లను బ్యాకప్ చేసుకోవడం సాధారణమైన విషయమే అయితే ప్రస్తుతం ఈ బ్యాకప్ కాస్త క్లిష్టమైన విధానంతో కూడుకుంది.

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. వాట్సాప్ ట్రాన్స్‌ఫర్ చాట్ హిస్టరీ అనే ఫీచర్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌తో కేవలం ఒకే ఒక క్లిక్‌తో వాట్సప్ చాట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

ఈ కొత్త ఫీచర్ సహాయంతో యూజర్లు గూగుల్ డ్రైవ్‌ను ఉపయోగించకుండానే పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కి చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి రానుంది.

ఇందుకోసం యాప్ సెట్టింగ్స్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది. వెంటనే మీ పాత వాట్సాప్ చాట్స్ బ్యాకప్ అవుతాయి. ప్రస్తుతం వాట్సాప్ బ్యాకప్ కోసం ఐక్లౌడ్ లేదా గూగుల్ డిస్క్‌కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్‌లో చాట్ హిస్టరీ పొందేవారు.

అయితే ఇప్పుడు ఈ సమస్య లేకుండా కేవలం ఒకే ఒక్క స్కాన్ తో చాట్ హిస్టరీని బదిలీ చేసేందుకు ఫీచర్ ఉపయోగపడుతుంది. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా క్లౌడ్ బ్యాకప్‌ను బైపాస్ చేసి, మరో ఫోన్‌లోకి చాట్ హిస్టరీని పంపుతుంది. త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.




