- Telugu News Photo Gallery Parenting Tips: Press these two points on your baby's feet make them stop crying
Parenting Tips: పిల్లలు ఉన్నట్లుండి గుక్కపట్టి ఏడుస్తున్నారా? కాలుపై ఇలా చేస్తే చిటికెలో నవ్వేస్తారు..
ఒక్కోసారి పిల్లలు ఆకారణంగా ఏడుస్తుంటారు. వాళ్ల ఏడుపు ఏవిధంగా మాన్పాలో తెలియక తల్లిదండ్రులు తికమక పడిపోతుంటారు. అయితే నిపుణులు సింపుల్ చిట్కా ఒకటి చెబుతున్నారు. సాధారణంగా పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏడుపు ద్వారా తమ భావాలను చూపిస్తుంటారు..
Updated on: Mar 12, 2025 | 8:40 PM

పిల్లల నిర్మలమైన నవ్వు చూస్తే మనసులోని బాధ అంతా ఇట్టే మాయమైపోతుంది. అయితే ఒక్కోసారి పిల్లలు ఆకారణంగా ఏడుస్తుంటారు. వాళ్ల ఏడుపు ఏవిధంగా మాన్పాలో తెలియక తల్లిదండ్రులు తికమక పడిపోతుంటారు.

అయితే నిపుణులు సింపుల్ చిట్కా ఒకటి చెబుతున్నారు. సాధారణంగా పిల్లలు ఆకలిగా ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏడుపు ద్వారా తమ భావాలను చూపిస్తుంటారు. అందుకే చిన్నపిల్లలు ఎందుకు నవ్వుతారో, ఎందుకు ఏడుస్తారో అర్థం చేసుకోవడం తల్లులకు కష్టమైన టాస్క్.

పిల్లలు ఏడుపు ఆపాలంటే నిపుణులు సూచిస్తున్న చిట్కా ఏంటంటే.. పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటే లైట్లు ఆపివేసి చీకటి గదిలో ఉంచాలి. పిల్లలను శాంతింపజేయడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఇది ఒకటి. పిల్లలు ఎప్పుడూ ఏడ్చినా చీకటి గదిలోకి తీసుకెళ్లి వారిని సముదాయిస్తే వెంటనే ఏడుపు ఆపేస్తారట.

అలాగే పిల్లల పాదాల మధ్యలో నొక్కడం ద్వారా కూడా వారి ఏడుపు ఆపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఒక వేళ కడుపులో గ్యాస్ కారణంగా ఏడుస్తుంటే, ఈ ఉపాయాలు ఉపయోగించడం వల్ల నొప్పి తగ్గుతుంది. పిల్లలు కూడా ఏడుపు ఆపుతారు.

కొంతమంది పిల్లలు జలుబు వల్ల వచ్చే తలనొప్పి వల్ల కూడా ఏడవవచ్చు. పిల్లల వేళ్లను 3 నిమిషాల కంటే ఎక్కువసేపు చిన్నగా నొక్కడం ద్వారా వారు ఉపశమనం పొంది నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది. ఈ పద్ధతులు ప్రయత్నించిన తర్వాత కూడా పిల్లలు ఏడుపు ఆపకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.





























