Why Quitting Is Hard: సిగరెట్ స్మోకింగ్ అందుకే త్వరగా వదిలేయలేం..! దీని అసలు రహస్యం ఏంటో తెలుసా
స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అనే విషయం మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి అలవాటైనాక ఈ అలవాటును మానుకోవడం చాలా కష్టం. దీనినే 'వ్యసనం' అంటారు. పొగాకు వ్యసనం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా, చాలా మంది ఈ వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నారు. మరి ఇలా ఎందుకు..
Updated on: Mar 12, 2025 | 8:21 PM

పొగాకు వాడకం వల్ల కలిగే హాని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి అలవాటైనాక ఈ అలవాటును మానుకోవడం చాలా కష్టం. దీనినే 'వ్యసనం' అంటారు. పొగాకు వ్యసనం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ప్రభావితం చేస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా, చాలా మంది ఈ వ్యసనం నుంచి బయటపడలేకపోతున్నారు. మరి ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?

పొగాకులో నికోటిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి ప్రవేశించి అనేక రకాల తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. నికోటిన్ మెదడులో డోపమైన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఇది మంచి అనుభూతిని కలిగిస్తుంది.

నిరాశకు గురైన వ్యక్తులు ధూమపానం చేయడానికి కూడా నికోటినే కారణం. ఇది మెదడుకు చేరుకోవడానికి కేవలం 10 సెకన్లు మాత్రమే పడుతుంది. ఇది వారికి మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే వారు పొగాకు, సిగరెట్లకు బానిసలుగా మారతారు.

మీకూ సిగరెట్లు కాల్చే అలవాటు ఉంటే, దానిని నియంత్రించడానికి మొదట మీ మనస్సులో తలెత్తే కోరికలను అణచివేయండి. మీకు ఆనందాన్ని ఇచ్చే, మీ మనసును ప్రశాంతపరిచే మరేదైనా పనిలో పాల్గొనండి.

ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తుంటే, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దీని గురించి చెప్పి వారి సహాయం పొండాలి. వారు చెప్పేది వినండి. అది మీకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది.





























