- Telugu News Photo Gallery Okra Water For Diabetes: How To Make Okra Water For Blood Sugar Management
Okra Water For Diabetes: షుగర్ పేషెంట్లకు అమృత జలం.. ఉదయాన్నే పరగడుపున ఈ నీటిని తాగితే చాలు
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే కిడ్నీలు, కళ్ళు, నరాలు దెబ్బతిన్నాయి. మధుమేహం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే అది అంత తేలిగ్గా వదలదు. అందుకే మధుమేహం నియంత్రణకు నిత్యం మందులు వాడాలి. దానితో పాటు పచ్చి కూరగాయలు తినడం కూడా చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు బెండకాయలు నానబెట్టిన నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని..
Updated on: Jun 12, 2024 | 12:38 PM

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే కిడ్నీలు, కళ్ళు, నరాలు దెబ్బతిన్నాయి. మధుమేహం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే అది అంత తేలిగ్గా వదలదు. అందుకే మధుమేహం నియంత్రణకు నిత్యం మందులు వాడాలి. దానితో పాటు పచ్చి కూరగాయలు తినడం కూడా చాలా ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు బెండకాయలు నానబెట్టిన నీరు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

అవును.. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవాలంటే, బెండకాయ నీటిని తీసుకోవాలట. బెండలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కరిగే, కరగని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా ఈ విధమైన ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

బెండ నీరు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సమయంలో చక్కెరలు, పిండి పదార్ధాలు గ్లూకోజ్‌గా విభజించబడతాయి కాబట్టి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అంతేకాకుండా, బెండ నీరు కార్బోహైడ్రేట్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.

బెండలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు ఎల్లప్పుడూ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. కాబట్టి డయాబెటిక్ రోగులకు బెండ నీరు ప్రయోజనకరంగా ఉంటుంది.

డయాబెటిక్ పేషెంట్లలో మెంతి నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. శరీరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. బెండ కాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ముక్కలు తొలగించి నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.




