- Telugu News Photo Gallery Mint Leaves Health Benefits: Amazing benefits of mint leaves you can't ignore
Mint Leaves: రోజుకు రెండు పుదీనా అకులు నోట్లో వేసుకుంటే ఆ సమస్యలన్నీ పరార్..
పుదీనాలో ఆరోగ్యానికి మేలు చేసే పెరటి మొక్క. దీని శాస్త్రీయ నామం మెంథా స్పికాటా. పిప్పరమింట్‌ను ఆంగ్లంలో స్పియర్‌మింట్ అంటారు. భారతీయ వంటలలో విస్తృతంగా దీనిని ఉపయోగిస్తుంటారు.పుదీనా వాసన వంటకి కొత్త రుచిని ఇస్తుంది. పలావ్, బిర్యానీ, చట్నీ, స్మూతీ, జ్యూస్ మొదలైన అనేక రకాల వంటలలో పుదీనాను ఉపయోగిస్తుంటారు. పుదీనాలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. పొట్టలోని గ్యాస్‌ను తొలగించడమేకాకుండా కండరాల నొప్పుల నుంచి..
Updated on: Oct 18, 2023 | 9:24 PM

పుదీనాలో ఆరోగ్యానికి మేలు చేసే పెరటి మొక్క. దీని శాస్త్రీయ నామం మెంథా స్పికాటా. పిప్పరమింట్‌ను ఆంగ్లంలో స్పియర్‌మింట్ అంటారు. భారతీయ వంటలలో విస్తృతంగా దీనిని ఉపయోగిస్తుంటారు.పుదీనా వాసన వంటకి కొత్త రుచిని ఇస్తుంది. పలావ్, బిర్యానీ, చట్నీ, స్మూతీ, జ్యూస్ మొదలైన అనేక రకాల వంటలలో పుదీనాను ఉపయోగిస్తుంటారు.

పుదీనాలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. పొట్టలోని గ్యాస్‌ను తొలగించడమేకాకుండా కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగిస్తారు. పుదీనా తింటే మూత్ర విసర్జన సజావుగా అయ్యి, కిడ్నీలు క్లీన్ అవుతాయి.

పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది యాంటీ ఫంగల్, డయేరియాను కూడా తగ్గిస్తుంది. పుదీనా తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. ఇది జ్వరాన్ని సైతం తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పుదీన జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. పేగుల నుంచి టాక్సిన్స్‌ను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. పుదీనాను పెరట్లో, బాల్కనీలో సులభంగా పెంచుకోవచ్చు.

పుదీన ఆకుల సారం వివిధ క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పుదీనా ఆకుల రసం రొమ్ము, నోటి క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పుదీనా ఆకు సారం తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ ఐదు నుంచి ఆరు పుదీనా ఆకులను తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.




