
అందాల ముద్దుగుమ్మ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం, శ్రీ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అనతి కాలంలో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

హ్యాప్పీడేస్ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకొని అక్కినేని నాగచైతన్య సరసన 100% లవ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక ఈ మూవీ తర్వాత తమన్నాకు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, జూనియర్ ఎన్టీ ఆర్ ఇలా ప్రతి ఒక్కరి సినిమాలో ఛాన్స్ కొట్టేసి, అందరి స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. కొన్ని రోజుల పాటు తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ.

ఇక తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసిన విషయం తెలిసిందే. అక్కడ పలు సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా, జీన్స్ తో ప్రత్యేకంగా తయారు చేయించిన డ్రెస్‌లో తన అంద చందాలతో అందరినీ తన వైపుకు లాక్కుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.