బియ్యపు గింజపై బొమ్మలు.. టూత్‌పిక్‌పై కొటెషన్స్.. ఆమె ట్యాలెంట్‌ చూస్తే మతిపోవాల్సిందే!

Edited By:

Updated on: May 08, 2026 | 8:06 PM

సాధారణంగా చూస్తే చిన్నవిగా అనిపించే వస్తువులపై అసాధారణమైన కళను ఆవిష్కరిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. టూత్‌పిక్‌పై పేర్లు చెక్కడం, బియ్యపు గింజపై బొమ్మలు వేయడం, చిన్న టాబ్లెట్స్‌పై 'జనగణమన' రాయడం.. ఇవన్నీ వినడానికే అసాధ్యం అనిపించే కళలు. కానీ విజయవాడకు చెందిన సుజాత అనే మైక్రో ఆర్టిస్ట్ మాత్రం తన ఓపిక, ఏకాగ్రతతో ఈ సూక్ష్మ కళలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. శ్రద్ధ ఉంటే ఎంత చిన్న స్థలంలోనైనా కళను పండించవచ్చని ఆమె నిరూపిస్తున్నారు.

1 / 5
బియ్యపు గింజపై చిత్రలేఖనం: బియ్యపు గింజంత చిన్న స్థలంలో కూడా కళకు హద్దులు లేవని సుజాత చాటిచెబుతున్నారు. రైస్ గ్రేన్స్‌పై సూక్ష్మ చిత్రాలు వేస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కంటికి సరిగా కనిపించని పరిమాణంలో కూడా బొమ్మలకు సరైన ఆకారం ఇవ్వడం మైక్రో ఆర్ట్‌లో ఆమె సాధించిన పట్టుకు నిదర్శనం.

2 / 5
టాబ్లెట్స్‌పై జనగణమన: చిన్న టాబ్లెట్‌పై భారత జాతీయ గీతమైన జనగణమన అక్షరాలను రాయడం సుజాత ప్రతిభకు మచ్చుతునక. కంటితో చూడటానికే కష్టంగా ఉండే పరిమాణంలో, అక్షరాలను స్పష్టంగా తీర్చిదిద్దడం వెనుక ఆమె గంటల తరబడి చేసే కృషి కనిపిస్తుంది. ఒక్కో అక్షరాన్ని ఎంతో జాగ్రత్తగా మలుస్తూ, ప్రత్యేకమైన పరికరాల సాయంతో ఆమె ఈ అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నారు.

3 / 5
టూత్‌పిక్‌లపై పేర్లు: సూదికన్నా సన్నగా ఉండే టూత్‌పిక్‌లపై పేర్లు చెక్కడం కూడా సుజాత ప్రత్యేకతల్లో ఒకటి. ఒక్క చిన్న పొరపాటు జరిగినా మొత్తం కళాఖండం దెబ్బతినే అవకాశం ఉండటంతో చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి వస్తుంది. అయినా ఆమె అక్షరాలను స్పష్టంగా చెక్కుతూ ఆకట్టుకుంటున్నారు. ఈ కళను చూసిన వారు ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

4 / 5
అరుదైన నోట్లు, నాణేల సేకరణ: సూక్ష్మ కళలతో పాటు అరుదైన వస్తువులను సేకరించడంపై కూడా సుజాతకు మక్కువ ఎక్కువ. పాతకాలపు నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లు, అరుదైన స్టాంపులు వంటి ఎన్నో విలువైన వస్తువులను ఆమె సేకరించారు. ప్రతి నాణెం, ప్రతి నోటు వెనుక ఒక ప్రత్యేక చరిత్ర ఉంటుందని ఆమె నమ్ముతారు. ఇప్పటివరకు ఆమె సేకరించిన కలెక్షన్స్ చూస్తే ఆమె ఇంట్లో ఒక చిన్న మ్యూజియమే తలపిస్తోంది.

5 / 5
పట్టుదలతో ప్రత్యేక గుర్తింపు: సాధారణంగా కనిపించే చిన్న వస్తువుల్లో అసాధారణ కళను చూపించగలగడం నిజమైన ప్రతిభ అని సుజాత చెబుతున్నారు. కళ అంటే కేవలం పెద్ద చిత్రాలు మాత్రమే కాదు, అతి చిన్న స్థలంలో కూడా అద్భుతాన్ని సృష్టించవచ్చు అని సుజాత నిరూపిస్తున్నారు. సాధారణ వస్తువుల్లో అసాధారణమైన కళను చూపిస్తూ, తన విలక్షణమైన ప్రతిభతో ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు

Follow Us