Pak Players In IPL 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆడుతున్న ఈ ముగ్గురు పాకిస్థాన్‌కు చెందినవారని మీకు తెలుసా..? వివరాలిదిగో..
2008లో భారత్‌పై పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి నిషేధించారు. దీంతో అప్పటి నుంచి పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో అవకాశం లభించడం లేదు. అయితే పాకిస్థాన్ మూలలు కలిగి, ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆడబోతున్న ముగ్గురు విదేశీ ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Dec 27, 2022 | 10:19 PM

ఐపీఎల్ 16వ సీజన్ కోసం సర్వం సిద్ధంగా ఉంది. డిసెంబర్ 23న కొచ్చి వేదికగా నిర్వహించిన మినీ వేలం ద్వారా మొత్తం 87 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. విశేషమేమిటంటే.. ఈ వేలం ద్వారా పాక్ సంతతికి చెందిన ఇద్దరు క్రికెటర్లకు కూడా ఐపీఎల్‌లో అవకాశం దక్కింది. అయితే అతను పాకిస్థాన్ జాతీయ జట్టులో సభ్యుడు కాకపోవడం విశేషం.

ప్రతి ఏటా జరిగే ఐపీఎల్ టోర్నమెంట్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు బీసీసీఐ నుంచి అనుమతి లభించకపోయనప్పటికీ.. పాకిస్థాన్ మూలాలతో ఇతర దేశాలకు ఆడుతున్న ఆటగాళ్లకు ఆ అవకాశం ఉంది. వీరు గతంలోనూ ఐపీఎల్‌లో కనిపించారు. ఈసారి కూడా పాకిస్థాన్ మూలాలు ఉన్న ముగ్గురు ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఉన్నారు.

మొయిన్ అలీ: ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ పూర్వీకులు పాకిస్థాన్‌కు చెందినారు. కానీ అలీ ఇంగ్లండ్ కోసం తన క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. గతంలో RCB తరపున కనిపించిన మొయిన్ అలీ, ఇప్పుడు CSK జట్టులో ఉన్నాడు.

సికందర్ రాజా: జింబాబ్వే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సికందర్ రాజా పాకిస్థాన్ మూలానికి చెందినవాడు. రాజా పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లోనే జన్మించారు. చిన్నతనంలో పాకిస్థాన్‌లో ప్రాక్టీస్ ప్రారంభించిన సికిందర్.. జింబాబ్వే తరఫున తన కెరీర్‌ను ప్రారంభించడం విశేషం. ఈసారి ఐపీఎల్ వేలంలో కనిపించిన సికందర్ రాజాను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.

ఆదిల్ రషీద్: ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ పూర్వీకులు కూడా పాకిస్థాన్‌వారే. ఇప్పుడు ఇంగ్లండ్ జట్టులో అగ్రగామి స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన ఆదిల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.





























