Kitchen Tips: స్నాక్స్‌ తయారీలో కార్న్‌ఫ్లోర్‌ బదులుగా ఈ పిండి వాడారంటే.. కరకరలాడే స్నాక్స్ చిటికెలో రెడీ!

Updated on: Nov 19, 2023 | 8:11 PM

సాయంత్రం పూట రుచికరమైన స్నాక్స్‌ తినడానికి ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పకోడా, వడలు, సమోసా వంటివి తినడానికి ఇష్టపడతారు. పకోడాలు, వడలు వండడానికి కార్న్‌ఫ్లోర్ అవసరం. ముఖ్యంగా పకోడా తయారీలో కార్న్‌ఫ్లోర్‌ వినియోగిస్తే క్రిస్పీ కరకరలాడుతూ వస్తాయి. అయితే కొందరు వంట సమయానికి కార్న్‌ఫ్లోర్‌ అయిపోతే దానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుంటారు..

1 / 5
సాయంత్రం పూట రుచికరమైన స్నాక్స్‌ తినడానికి ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా పకోడా, వడలు, సమోసా వంటివి తినడానికి ఇష్టపడతారు. పకోడాలు, వడలు వండడానికి కార్న్‌ఫ్లోర్ అవసరం. ముఖ్యంగా పకోడా తయారీలో కార్న్‌ఫ్లోర్‌ వినియోగిస్తే క్రిస్పీ కరకరలాడుతూ వస్తాయి. అయితే కొందరు వంట సమయానికి కార్న్‌ఫ్లోర్‌ అయిపోతే దానికి బదులుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటుంటారు.

2 / 5
కార్న్‌ఫ్లోర్‌ను వంటల్లో ఎక్కువగా ఉపయోగించరు. అయితే స్టైర్-ఫ్రైస్ వండడానికి, చిక్కగా ఉండే సూప్‌లు లేదా గ్రేవీలను తయారు చేయడానికి ఈ పదార్ధం తప్పనిసరిగా ఉండాలి. అయితే వంట చేసేటప్పుడు కార్న్‌ఫ్లోర్ అయిపోతే.. దానికి బదులుగా బియ్యం పిండి కూడా ఉపయోగించవచ్చు. అయితే బియ్యం పిండిని ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడా మాత్రమే వంటల్లో వేసుకోవాలి. లేదంటే మరీ గట్టిగా తయారవుతుంది.

3 / 5
కార్న్‌ఫ్లోర్‌కు బదులుగా, మీరు వంటలో ఆరోరూట్‌ను ఉపయోగించవచ్చు. గ్రేవీకి యారోరూట్ జోడించడం వల్ల చిక్కగా ఉంటుంది. అయితే గ్లూటెన్-ఫ్రీ ఆరోరూట్‌ని మాత్రమే వంట్లో వినియోగించాలి.

4 / 5
చలికాలం సూప్ తినాలనుకుంటే కార్న్‌ఫ్లవర్‌కు బదులుగా అవిసె గింజలను ఉపయోగించవచ్చు. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక. సూప్‌లో 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ కలుపుకుంటే సరిపోతుంది. అలాగే అవిసె గింజలకు బదులుగా చియా విత్తనాలను కూడా ఉపయోగించవచ్చు.

5 / 5
గ్రేవీ చిక్కగా చేయడానికి కార్న్‌ఫ్లోర్‌కు బదులుగా శనగ పిండిని కూడా ఉపయోగించవచ్చు. శనగపండిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. గ్రేవీని చిక్కగా మారుస్తుంది. శనగపిండితో వడలు కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి కార్న్‌ఫ్లోర్‌ వినియోగించాల్సిన అవసరం ఉండదు.