కార్తీకమాసం స్పెషల్.. టెంపుల్ స్టైల్‌లో గోధుమ రవ్వతో ఇలా ప్రసాదం చేయండి!

Updated on: Nov 02, 2025 | 1:14 PM

కార్తీక మాసం వచ్చేసింది. అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం కూడా ఒకటి. దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది ఉపవాస దీక్ష ఉంటూ, శివకేశవులను ఆరాధిస్తుంటారు. నిత్యం దేవాలయాలకు వెళ్తూ, స్వామి వారికి పూజలు నిర్వహిస్తుంటారు.

1 / 5
ఇక ఈ మాసంలో చాలా మంది అద్భుతమైన ప్రసాదాలు చేస్తుంటారు. ముఖ్యంగా ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించకుండా, అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. కాగా, మనం ఇప్పుడు కార్తీక పౌర్ణమి రాబోతుంది. కాబట్టి ఇంట్లోనే చాలా త్వరగా చేయాల్సిన రుచికరమైన ప్రసాదాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
గోధుమ రవ్వ కేసరి : కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు. అయితే ఆ సమయంలో గోధుమ రవ్వతో చేసిన కేసరి, స్వామి వారికి నైవేద్యంగా పెట్ట వచ్చు. కాగా, ఇప్పుడు మనం అన్నవరం ప్రసాదం స్టైల్‌లో గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

3 / 5
కావాల్సిన పదార్థాలు : గోధుమ రవ్వ , ఎరుపు రంగులో ఉండేది, ఒక కప్పు, చక్కెర ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, కుంకుమ పువ్వు నాలు రెబ్బలు, వన్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్, కొద్దిగ పటిక, నెయ్యి పావు కప్పు. నీరు మూడు కప్పులు.

4 / 5
తయారీ విధానం : ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేయాలి.  తర్వాత అందులో గోధుమ రవ్వను వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత రవ్వను వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. మరో పాన్ తీసుకొని, స్టవ్ ఆన్ చేసి, దాంట్లో మూడు కప్పుల నీరు పోసి, మరగనివ్వాలి. తర్వాత అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను వేసి 10 నిమిషాలు మెత్తగా ఉడకబెట్టుకోవాలి.

5 / 5
ఆ తర్వాత అది ఉడికిన తర్వాత అందులోకి ఒక కప్పు చక్కెర వేసి, మెత్తగా కలుపుకోవాలి. మరో రెండు నిమిషాల తర్వాత బెల్లం వేసి, మళ్లీ మెత్తగా ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్, పటిక వేసి మెత్తగా కలపాలి. మరో రెండు నిమిషాల తర్వాత నెయ్యి వేసి, ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి. అంతే అన్నవరం స్టైల్ ప్రసాదం రెడీ, దీనిని అరిటాకులోకి తీసుకొని, తర్వాత ప్రసాదంలా తీసుకొని తింటే, అదిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి.