- Telugu News Photo Gallery It is very good to sleep with these under the pillow, Check Here is Details in Telugu
Astrology: దిండు కింద వీటిని పెట్టుకుని నిద్రిస్తే.. సంపద రెట్టింపు..
ప్రస్తుత కాలంలో సంపదతోనే అన్నీ ముడి పడి ఉన్నాయి. డబ్బు లేనిదే తిండి కూడా ఉండదు. తమ సంపాదన పెరగాలని అందరిలోనూ ఉంటుంది. కానీ కొంత మంది ఎంత కష్ట పడినా ఎలాంటి డబ్బు ఉండదు. అత్యవసర సమయాల్లో డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే సింపుల్ రెమిడీలు ఫాలో చేస్తే సంపదను నిలుపుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు దిండు కింద తులసి ఆకులు పెట్టుకుని పడుకుంటే.. మంచి నిద్ర పట్టడంతో పాటు.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. మనకు కూడా ప్రశాంతంగా..
Updated on: Sep 14, 2024 | 2:17 PM

ప్రస్తుత కాలంలో సంపదతోనే అన్నీ ముడి పడి ఉన్నాయి. డబ్బు లేనిదే తిండి కూడా ఉండదు. తమ సంపాదన పెరగాలని అందరిలోనూ ఉంటుంది. కానీ కొంత మంది ఎంత కష్ట పడినా ఎలాంటి డబ్బు ఉండదు. అత్యవసర సమయాల్లో డబ్బు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పే సింపుల్ రెమిడీలు ఫాలో చేస్తే సంపదను నిలుపుకోవచ్చు.

రాత్రి పడుకునే ముందు దిండు కింద తులసి ఆకులు పెట్టుకుని పడుకుంటే.. మంచి నిద్ర పట్టడంతో పాటు.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. మనకు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది.

లవంగాలు కూడా రాత్రి పడుకునే ముందు దిండు కింద పెట్టుకుని పడుకుంటే.. నిద్ర చక్కగా పడుతుంది. ఇంట్లో సంపద కూడా పెరుగుతుందని పలు శాస్త్రాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే తొలగిపోతాయి.

అలాగే మీరు ఎప్పుడూ క్యారీ చేసే పర్స్ లేదా హ్యాండ్ బ్యాగ్‌లో ఉండే చిన్న అద్దాలు కూడా దిండు కింద పెట్టుకుని పడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా మీకు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. నిద్ర కూడా లభిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది.

అదే విధంగా చిన్న గంధం ముక్క లేదా పసుపు ప్యాకెట్ అయినా రాత్రి నింద్రించే ముందు దిండు కింద పెట్టుకుని పడుకుంటే చాలా మంచిది. ఇవి నెగిటివ్ ఎనర్జీని తగ్గించడమే కాకుండా.. సంపదను రెట్టింపు చేస్తాయి. అలాగే ప్రశాంతంగా నిద్ర పట్టేలా చేస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




