AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెకండ్ హ్యాండ్ బైక్ కొంటే ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

కొంతమంది కొత్త బైక్ కొనే బడ్జెట్ లేక సెకండ్ హ్యాండ్ కొనాలనుకుంటారు. అయితే చాలామందికి పాత బైక్ కొనడం విషయంలో కొన్ని నియమాలు తెలీదు. దీనివల్ల నష్టపోతారు.  సెకండ్ హ్యాండ్ బైక్ కొనే ముందు, దాని పేపర్లు, ఇంజన్, బాడీ, టైర్లు, బ్రేక్‌లు, లైట్లు మరియు ఇతర ముఖ్యమైన భాగాలను సరిగ్గా చెక్ చేసుకోవాలి. అలాగే, టెస్ట్ రైడ్ చేసి బైక్ పనితీరును అంచనా వేయడం ముఖ్యం. 

Prudvi Battula
|

Updated on: Jul 30, 2025 | 3:19 PM

Share
సెకండ్ హ్యాండ్ కొనే ముందు బైక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. బైక్ టైటిల్ క్లియర్ గా ఉందో లేదో నిర్ధారించుకోండి. బైక్  VIN నెంబర్ టైటిల్ లో ఉన్న నెంబర్ తో సరిపోలుతుందో లేదో చూడాలి. ఇవి చెక్ చేయకుండ బైక్ తీసుకొంటే తర్వాత సమస్యల్లో పడతారు. 

1 / 5
ఇంజన్ స్టార్ట్ చేసి, ఏదైనా అసాధారణ శబ్దాలు వస్తున్నాయేమో వినాలి. పెట్రోల్ లీకేజీలు ఏవైనా ఉన్నాయేమో గమనించాలి. ఎగ్జాస్ట్ పొగను పరిశీలించాలి. నల్లటి పొగ వస్తే, ఇంజిన్ లో సమస్య ఉండవచ్చు. టెస్ట్ రైడ్ చేసి ఇంజన్ పనితీరును అంచనా వేయాలి. వీటిని చూసుకోలేదంటే మీరు నష్టపోతారు. 

2 / 5
బైక్ ఫ్రేమ్, ఫోర్క్ లకు గీతలు, డెంట్లు, పగుళ్లు ఉన్నాయో లేదో చూడాలి. ఇవి బైక్ పనితీరును ప్రభావితం చేస్తాయి. తుప్పు పట్టడం లేదా పెయింట్ పోవడం వంటి సమస్యలు గమనించాలి. ఇలాంటి ఉంటె బైక్ కొన్నిరోజుల్లో పాడైపోతుంది. అందుకే వీటిని ముందే చూసుకోవాలి. 

3 / 5
టైర్ల అరుగుదల, గ్రిప్, పంక్చర్ అయ్యే అవకాశం ఉందో లేదో చెక్ చేయాలి. బ్రేక్‌లు సరిగా పనిచేస్తున్నాయో లేదో గమనించాలి. అరిగిపోయిన బ్రేక్ ప్యాడ్‌లు, డిస్క్‌లు ఉంటే వాటిని మార్చవలసి ఉంటుంది. ఇవి ముందే చేసుకొని మార్చుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే 

4 / 5
హెడ్ లైట్, టెయిల్ లైట్, ఇండికేటర్లు, హార్న్ వంటివి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయాలి. కేబుల్స్, చైన్ వంటి వాటి పరిస్థితిని గమనించాలి. టెస్ట్ రైడ్ చేయడం ద్వారా బైక్ పనితీరును అంచనా వేయవచ్చు. గేర్లు సరిగ్గా మారుతున్నాయా లేదా, బ్రేక్‌లు ఎలా పనిచేస్తున్నాయి, హ్యాండిల్ ఎలా ఉందో గమనించాలి.

5 / 5