
తల స్నానం చేయడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో.. ప్రతి రోజూ తలస్నానం చేయడం వల్ల అన్నే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగని తల స్నానం చేయకపోతే మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ రోజులు హెడ్ బాత్ చేయక పోవడం వల్ల కేవలం మీ జుట్టు మాత్రమే కాకుండా.. మీ రూపం కూడా దెబ్బ తింటుంది. ఎక్కువ రోజులు తలను శుభ్రం చేసుకోకపోతే ఫోలికల్స్ అనేవి మూసుకు పోతాయి. జుట్టు రాలి పోవడమే కాకుండా.. తలపై బ్యాక్టీరియా, చికాకులు ఏర్పడతాయి. ఇంకా ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం.

ఎక్కువ రోజులు తల స్నానం చేయకుండా ఉంటే మీ జుట్టులో అదనపు నూనెలు ఏర్పడతాయి. మీ జుట్టు మరింత పెళుసుగా మారుతుంది. చిట్లడం, చివర్లు చీలి పోతుంది. అలాగే జీవ శక్తిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.

ఎక్కువ రోజులు తల స్నానం చేయకపోతే జుట్టు నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. చూడటానికి కూడా అసహ్యంగా మారుతుంది. అలాగే జుట్టుపై నూనె ఉండటం వల్ల ధూళి, దుమ్మూ చేరుతుంది.

ఎక్కువ రోజులు తల స్నానం చేయక పోవడం వల్ల తలపైకి ధూళి, దుమ్మూ చేరుతుంది. ఇది కాస్తా చుండ్రుగా మారుతుంది. దీంతో దురద కూడా ఎక్కువగా వస్తుంది. చుండ్రు ఒక్కసారి వచ్చిందంటే అంత తేలిగ్గా పోదు.

చాలా రోజులు తల స్నానం చేయకపోతే.. మీ స్కాల్ఫ్ పైకి నూనె అనేది తయారవుతుంది. ఇది చెమట రూపంలో మెడపైకి, ముఖంపైకి చేరుతుంది. దీంతో మొటిమలు, దురద, అలెర్జీ, మచ్చలు వంటి ఇతర సమస్యలు ఏర్పడతాయి.